ఏప్రిల్ 8న సర్దార్ గబ్బర్‌సింగ్

PawanKalyan

చిన్న హిరో అయినా, పెద్ద హిరో అయినా సినిమా రిలీజ్ డేట్ ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. ఎందుకంటే హిరోలు పెరిగారు, పెద్ద హిరోలు పెరిగారు, సినిమాలు సంఖ్య పెరిగింది, పెద్ద హిరోలు చేసే సినిమాల సంఖ్య పెరిగింది, ..మనకు వున్న సినిమాల సీజన్స్ తక్కువ. మొన్న సంక్రాంతికి నాలుగు సినిమాలు రిలీజ్ అయిన విషయం తెలిసిందే.

సమ్మర్ అంటే మార్చిలో పబ్లిక్ ఎక్సామ్స్ అయిపొయిన తర్వాత వచ్చే ఏప్రిల్ మొదటి వారం నుంచి మొదలు అనుకొవచ్చు. నాలుగు పెద్ద సినిమాలు ఈ సమ్మర్‌లో రిలీజ్ ప్లాన్ చేసుకుంటున్నారు. 1) బ్రహ్మోత్సవం 2)సరైనోడు 3) సర్దార్ గబ్బర్‌సింగ్ 4) ఊపిరి. అందరూ ఏప్రిల్‌ల్లోనే అనుకున్నారు.

ముందుగా మార్చి 28 అని నాగార్జున తన సినిమా డేట్ ఎనౌన్స్ చేసాడు. ఆ తర్వాత సర్దార్ గబ్బర్‌సింగ్ ఏప్రిల్ 8న అని ఎనౌన్స్ చేసారు. బ్రహ్మోత్సవం సరైనోడు కూడా ఎనౌన్స్ చేసేస్తే, బాగుంటుంది. చిన్న నిర్మాతలు తమ సినిమాలకు ఎప్పుడు రిలీజ్ చేసుకొవాలో ప్లాన్ చేసుకుంటారు.

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సర్దార్ గబ్బర్‌సింగ్, Featured. Bookmark the permalink.