ఇటీవల అందరి దృష్టినీ ఆకర్షించిన తమిళ చిత్రం ‘తని ఒరువన్’. ఈ సినిమా కథను రామ్‌చరణ్ చాలా ఇష్టపడ్డాడు. సురేందర్ రెడ్డికి ఒక సినిమా చేస్తానని మాటివ్వడంతో. సురేందర్ రెడ్డిని దర్శకునిగా ఎంపిక చేశారు. తెలుగుకి తగ్గట్టు కథల్లో కొన్ని మార్చులూ, చేర్పులు చేశారు. గురువారం హైదరాబాద్‌లో ఈ చిత్ర షూటింగ్ లాంఛనంగా ప్రారంభమైంది.ఈ 22 నుంచి రెగ్యులర్ షూటింగ్. గ్యారంటీ హిట్ అయ్యే అవకాశాలు వున్న సినిమా.
ఈ సినిమాను బ్రూస్‌లీ నిర్మాత దానయ్య చేయవలసివుండగా, ఎందుకో(కారణాలు తెలియదు) అల్లు అరవింద్ చేస్తున్నాడు. ‘మగధీర’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత దాదాపు ఏడేళ్లకు మళ్లీ గీతా ఆర్ట్స్‌లో చరణ్ చేస్తున్న చిత్రం ఇది. ఇందులో రామ్‌చరణ్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపిస్తారు. రకుల్ ప్రీత్‌సింగ్‌ను నాయిక. తమిళంలో చేసిన విలన్ పాత్రను తెలుగులో కూడా అరవింద్ స్వామే చేయనున్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వి.వై. ప్రవీణ్‌కుమార్, సహ నిర్మాత: ఎన్.వి. ప్రసాద్.