మాస్ .. ఊర మాస్

sarainodu

అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘సరైనోడు’ సినిమా టీజర్ విడుదలైంది. గురువారం మధ్యాహ్నం టీజర్ ను యూట్యూబ్ లో అప్ లోడ్ చేశారు. ఈ లింకును బన్నీ తన ట్విటర్ పేజీలో పోస్ట్ చేశాడు. అభిమానులకు ఈ టీజర్ నచ్చుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. దర్శకుడు బోయపాటి శ్రీను స్టైల్లో యాక్షన్ సన్నివేశాలున్నాయి. బన్నీ సరికొత్త లుక్ తో యాక్షన్ సీన్స్ ఇరగదీశాడు. త్వరలోనే ఆడియో విడుదల చేస్తామని చిత్రయూనిట్ తెలిపింది.

గీతా ఆర్ట్స్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రానికి ఎస్ఎస్ థమన్ సంగీతం అందించాడు. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ ఒక పాట కూడా పాడాడు. రేసుగుర్రం, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలతో హిట్ కొట్టిన బన్నీ ‘సరైనోడు’తో హాట్రిక్ సాధించేందుకు సిద్ధమవుతున్నాడు. అతడి సరసన రకుల్ ప్రీత్, కేథరిన్ నటిస్తున్నారు. ఆది పినిశెట్టి, శ్రీకాంత్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.

httpv://youtu.be/5oonhFB-cpw

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సరైనోడు, Featured. Bookmark the permalink.