ప్రస్తుతం పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘సర్దార్ గబ్బర్ సింగ్’. ఈ చిత్రానికి పవర్ బాబీ దర్శకత్వం వహిస్తున్న సంగతి అందరికీ తెల్సిందే.
కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్, నార్త్‌స్టార్ ఎంటర్టైనమెంట్స్ ప్రై.లిమిటెడ్, ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి పవనకల్యాణ్, శరత మరార్ నిర్మాతలు. ఓవర్ కాన్ఫిడెన్సో తెలియదు, హైప్ చెయ్యడం ఎందుకో అని అనుకుంటున్నారో తెలియదు, సినిమా గురించి అసలు ఇన్ఫార్మేషన్ బయటకు రావడం లేదు.
ఈ సమ్మర్‌కు ఎన్నో సినిమాలు తయరవుతున్నాయి. ఎవరికి వాళ్ళు, తమ తమ సినిమాలను హైప్ చేసుకునే పనిలో వున్నారు. సర్దార్ గబ్బర్‌సింగ్ నిర్మాత ‘శరత మరార్’ మాత్రం ట్వీటర్లో రెండు మూడు ఫోటొలు పెట్టి పబ్లిసిటీ కానిచ్చేస్తున్నాడు. ఏప్రిల్ 8 అంటే, ఇంకా 6 వారాలు కూడా లేదు. ఇంకా ఈ సినిమా పబ్లిసిటీ స్టార్ట్ చెయ్యకపొవడం అభిమానులకు ఆందోళనకు కలుగజేస్తుంది.