అడ్డాల శ్రీకాంత్, క్రిష్ లాంటి దర్శకులతో “ముకుంద” & “కంచె” లాంటి క్లాస్ సినిమాలు ప్రయత్నం చేసిన వరుణ్‌తేజ్, ఇప్పుడు మాస్ రూటులోకి వచ్చేసాడు. ముకుంద సినిమా చూసి, సిరియల్స్‌కు ఎక్కువ సినిమాలకు తక్కువ క్యాడెంట్ అన్నారు. కంచె సినిమాతో క్లాస్ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఆ తర్వాత లోఫర్‌తో మాస్ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు
ఇప్పుడు శ్రీనువైట్ల సినిమాను ఒప్పుకొని పూర్తిగా మాస్ రూటులోకి వచ్చేసాడు.
ఠాగూర్ మధు, నల్లమలుపు శ్రీనివాస్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. శ్రీనువైట్ల తనదైన శైలిలో విభిన్నంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్ పతాకంపై అత్యంత భారీ నిర్మాణ వ్యయంతో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఇందులో వరుణ్‌తేజ్ సరసన ఇద్దరు ప్రముఖ కథానాయికలు నటించనున్నారు. ఏప్రిల్ 8 రోజున ఉగాది పర్వదినంనాడు ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభంకానుంది. వరుణ్‌తేజ్ ఎనర్జీ లెవల్స్‌కు తగ్గ కథ ఇదనీ… శ్రీనువైట్ల, వరుణ్‌తేజ్ కాంబినేషన్‌లో రూపొందే ఈ చిత్రం క్లాస్, మాస్‌నీ ఆకట్టుకునే విధంగా ఉంటుందని నిర్మాతలు తెలిపారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియజేస్తామని చెప్పారు. ఈ చిత్రానికి కెమెరాః యువరాజ్.