అన్నయ్య ప్రస్తావన లేకుండా ..

pawankalyan-interview

మెగాస్టార్ లేకపొతే పవర్‌స్టార్ లేడు .. ఇది నిజం

పవన్ కళ్యాణ్.. పవన్ కళ్యాణ్.. ఇవి గత రెండు మూడు రోజుల నుండి టీవీల్లోనూ, సామాజిక మాధ్యమాల్లోను వినిపిస్తున్న పదాలు. సినిమా నుండి రాజకీయాల్లోకి వచ్చి తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ తాజాగా బాలీవుడ్ క్రిటిక్ ‘అనుపమ చోప్రాతో’ జరిగిన ఇంటర్వ్యూలో అసలు అన్నయ్య ప్రస్తావన లేకుండా .. ‘నేను సినిమాల్లోకి రావాలనుకోలేదు.. బలవంతంగా తీసుకురాబడ్డాను. ఇంకో 2, 3 సినిమాలు చేసి ఆ తరువాత మానేస్తా. సినిమాలకన్నా రాజకీయాలే సేఫ్’ అంటూ తన నిజాయితీని చాటి ‘స్పృహలో ఉండి నేనేం చేసినా అందుకు నేనే భాద్యుడిని’ తన మీద తనకున్న నియంత్రణను తెలుపుతూ ‘భవిష్యత్తులో శాంతి భద్రతల గురించే ఆలోచిస్తానంటూ’ సమాజం పట్ల తన భాద్యతను గుర్తుచేసుకుని ‘వారసత్వాన్ని నమ్మనంటూ’ తనలో అంకిత భావాన్ని భయటపెట్టి ‘మన పని మనం చేసి వెంటనే మాయమైపోవాలి’ అనే జీవిత సత్యాన్ని తెలియపరిచిన పవన్ మనసులో ఊహకందని ఆలోచనలు, అబ్బురపరిచే నిబద్దతలు, సామాన్య మనిషికి అవసరమైన రాజకీయ లక్ష్యాలు ఎన్నో ఉన్నాయి. సందర్బాన్ని, సమయాన్ని బట్టి అవి బయటకొస్తాయి. ప్రస్తుతం ఆయన మనసులో ఉన్న కొన్ని ఆలోచనలను బయటకు పంచుకున్నారు.

తన గురించి తను ఎన్ని గొప్పలు చెప్పుకున్నా, తనకున్న ఫాలోయింగ్ గురించి ఒకపక్క కేర్ చెయ్యను అని అంటూనే, మరో పక్క ఎంత అతిగా వూహించుకుంటున్నాడో తెలియజేస్తూ, అన్నయ్య ప్రస్తావన లేకపొయేసరికి, ఉప్పులేని కూరలా చప్పగా వుంది ఇంటర్వ్యూ.

p.s: ఎడిటింగ్‌లో కట్ అయ్యి వుంటే, sorry to pawan kalyan.

httpv://youtu.be/fBYCoFoHnuU

httpv://youtu.be/7pH0DbTwh_o

httpv://youtu.be/ddJGD6lY0z8

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సర్దార్ గబ్బర్‌సింగ్, Featured. Bookmark the permalink.

1 Response to అన్నయ్య ప్రస్తావన లేకుండా ..

  1. venkat deep అంటున్నారు:

    Well said Pawanfans.com

    I really appreciate your voice and there’s only 1 version of truth.

    I felt very low when he said that he was forced & pushed in to cinema industry. He talked about the way he got evolved and all, What he said can be true but they all are hugely incomplete without his brother.

వ్యాఖ్యలను మూసివేసారు.