“సర్దార్ గబ్బర్‌సింగ్” ఆడియో ఫంక్షన్‌కు చిరంజీవి చీఫ్ గెస్ట్ అనే ప్రచారం జోరుగా జరుగుతుంది. మొన్న పవన్‌కల్యాణ్ ఇంటర్వ్యూలో అన్నయ్య చిరంజీవి ప్రస్తావన లేకపొవడంతో చప్పగా వుంది. అన్నయ్య చీఫ్ గెస్ట్ అనే ప్రచారం నిజమైతే మంచిదే.
చిరంజీవి స్వయంకృషితో ఎదిగిన వ్యక్తి. అప్పట్లో అవకాశాల కోసం చాలామంది వెంట పడ్డాడు. అందులో దాసరి నారాయణరావు ఒకడనుకుంటా. అప్పట్లో ఇచ్చిన గౌరవం ఇప్పుడు ఇవ్వటంలేదనే కోపం వున్నవాళ్ళల్లో దాసరి ప్రధముడు. వారిద్దరి మధ్య దూరం మరింత ఎక్కువై, చిరంజీవి పేరు చెపితే దాసరికి ఎక్కడలేని తిక్క రేగి కల్లు త్రాగిన కోతిలా నోటికోచ్చింది వాగుతూ వుంటాడు. పవన్‌కల్యాణ్ అంటే మాత్రం మంచి ప్రేమను ఒలకపోస్తూ వుంటాడు.
శత్రువుని రెచ్చగొట్టి, లేని శత్రుత్వాన్ని పెంచుకొనే కంటే, శత్రువు కోరుకునే మిత్రత్వాన్ని ఇచ్చేస్తే, మనకే మంచిదని చిరంజీవితో పాటు దాసరి కూడా చీఫ్ గెస్ట్‌గా పిలిస్తే మంచిది. అది పవన్‌కల్యాణ్‌కే సాధ్యం.