పవన్ కల్యాణ్ కొట్టలేదు

Screen Shot 2016-03-19 at 3.52.30 PM

అక్కడ జరిగేది ఒకటి. బయట ప్రచారం జరిగేది ఒకటి. ఇలా ఎన్నో ఎన్నో రూమర్స్ పవన్‌కల్యాణ్‌పై క్రియేట్ చేసిఒక చెడ్డ వ్యక్తిగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నాలు ఇప్పుడు మొదలయినవి కావు, ఎప్పటినుంచో వున్నవే. అప్పట్లో ఒక వర్గం వాళ్ళు చేస్తే, ఇప్పుడు ఆ డ్యూటీని ఇంకో వర్గం వాళ్ళు తీసుకున్నారు.

పవన్ కల్యాణ్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ షూటింగ్ లో ఉండగా కమెడియన్ షకలక శంకర్ని చెంపదెబ్బ కొట్టాడన్న వార్త గత రెండు రోజులుగా హల్ చల్ చేస్తోంది. ఈ క్రమంలో షకలక శంకర్ వివరణ ఇవ్వవల్సిన పని పడింది.. తన అభిమాన హీరోతో కలిసి సెట్లో చాలా ఎంజాయ్ చేశానని, అసలు ఏ గొడవా జరగలేదని చెప్పాడు. తను వండిన చేపల పులుసు అంటే పవన్ కల్యాణ్ కు ఇష్టమని, అలాగే తనతో జానపద గీతాలు కూడా పాడించుకుంటూ ఉంటారని పవన్ తో తన అనుబంధాన్ని పంచుకున్నాడు షకలక శంకర్.

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in Featured, Pawan Kalyan. Bookmark the permalink.