ప్రాణాలు లెక్కచేయనోడు పవర్‌ను కేర్ చేస్తాడా?

Pawan Kalyan

మనిషి గమ్యం మరణం

ఈరోజు ప్రెస్‌మీట్‌లో పవన్‌కల్యాణ్ చాలా సరదాగా మాట్లాడటంతో పాటు, మీడియా మిత్రులు మంచి ప్రశ్నలు సంధించడంతో సమాధానం చెప్పక తప్పలేదు.మీడియా మిత్రులు అడిగిన మంచి ప్రశ్నలలో ఒక మంచి ప్రశ్న.

ప్రశ్న: సినిమాలు ఆపేస్తే, ఇప్పుడున్న క్రేజ్ పొయే ఛాన్స్ వుంది. పర్వాలేదా?

చిరంజీవి రాజకీయల్లోకి వచ్చి ఎదో కొల్పోయాడని మెగా అభిమానులు చాలా ఫీల్ అయిపొతూ వుంటారు. అది నిజం కాదు, ఎందుకంటే జీవితంలో ఏదీ శాశ్వతం కాదు. జీవితమే శాశ్వతం కానప్పుడు, ఇంకా ఏదో కోల్పోవడం ఏమిటి? చిరంజీవి చేసిన ఒకే ఒక తప్పు ఏమిటంటే, 2009 ఎన్నికల ముందు రాష్ట్ర విభజనకు అంగీకరించి, కాంగ్రెస్ ఎనౌన్స్ చేయగానే “నో” అంటూ ప్లేటు ఫిరాయించడం. నిజానికి ఆంధ్ర ప్రజలందరూ అదే పని చేసారు. మీడియా సపోర్ట్ లేకపొవడంతో చిరంజీవిని ఎక్కువ టార్గెట్ చేసారు. రాష్ట్ర విభజన వలన వ్యక్తిగతంగా చిరంజీవికి ఏ నష్టం లేకున్నా, తెలుగువాళ్ళు విడిపొకూడదు అనే ఒకే ఒక సెంటిమెంట్‌కు లొంగి, సమైకాంధ్రకు సై అన్నాడు. దురదృష్టవశాత్తు, మంచి కోరుకున్నా చెడుగా వక్రీకరించబడ్డాడు. చిరంజీవికి రాజకీయాలు అవసరం కాదు కాబట్టి, ఫైట్ చేయలేకపొతున్నాడు, సపోర్ట్ కోసం కాంగ్రెస్‌లో చేసి మంచి పని చేసాడు. ఇప్పుడు జిరో ప్రెజర్.

పవన్‌కల్యాణ్‌కు కూడా రాజకీయాలు అవసరం లేదు. ఎలా కంటీన్యూ చేస్తాడనేది కచ్చితంగా పెద్ద పజిలే. చిరంజీవితో పోల్చుకుంటే పవన్‌కల్యాణ్‌కు వున్న ఒకే ఒక ఏడ్వాంటేజ్ ఏమిటంటే ప్రాణాలు లెక్కచెయ్యడు. పవర కేర్ చెయ్యడు.

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in Featured, Pawan Kalyan. Bookmark the permalink.