ఏప్రిల్ 8ని పవన్‌కల్యాణ్ కబ్జా చేసేసాడని ఏమీ డీలా పడకుండా, తనదైన స్టైల్లో అల్లు అర్జున్ ప్లానింగ్‌తో ముందుకు దూసుకుపొవడానికి సిద్దమవుతున్నాడు. కసితో మరో సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుడుతున్నాడు. సినిమాను హైప్ చెయ్యడానికి ఆడియో ఫంక్షన్ అనివార్యం అయిన ఈరోజుల్లో, ఆడియో ఫంక్షన్ కాన్సిల్ చేసి, ఆ ప్లేసులో ప్రీ రిలీజ్ ఫంక్షన్ అంటూ సరికొత్త ఫంక్షన్‌ను క్రియేట్ చేస్తున్నాడు.
అల్లు అర్జున్ కథానాయకుడిగా… బోయపాటి శ్రీను దర్శకత్వంలో… గీతా ఆర్ట్స్ బ్యానర్లో… అల్లు అరవింద్ నిర్మాణంలో తెరకెక్కిస్తున్న చిత్రం సరైనోడు. తమన్ సంగీతమందిస్తున్న ఈ చిత్ర పాటల్ని ఏప్రిల్ 1న నేరుగా మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఏప్రిల్ రెండో వారంలో విశాఖపట్నంలో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను చేయనున్నారు.
మాస్ కాదు .. వూర మాస్ అంటూ వచ్చిన సరైనోడు టీజర్ అటు ప్రేక్షకుల్లోనూ, ఇటు బిజినెస్ వర్గాల్లోనూ చాలా చాలా హైప్ క్రియేట్ చేసింది. థమన్ బ్రూస్‌లీ ఆడియోని మించి మంచి మాస్ ఆడియో ఇచ్చాడనే టాక్ వినిపిస్తుంది.