ఆడియో రివ్యూ వేరు. ఆడియో ఫంక్షన్ రివ్యూ వేరు. ఇది ఆడియో ఫంక్షన్ రివ్యూ నాలుగు ముక్కల్లో:
- ఈ ఫంక్షన్ అందరికీ నచ్చకపోవచ్చు. పవన్‌కల్యాణ్‌ను అభిమానిస్తు, చిరంజీవిని ఆరాధించే వాళ్ళకు OR చిరంజీవిని ఆరాధిస్తూ, పవన్‌కల్యాణ్‌ను అభిమానించే వాళ్ళకు మాత్రం తమ జీవితాల్లో ఒక మరిచిపొలేని అనుభూతి. పై ఫోటో ఒక్కటి చాలు.
- నేను చెప్పినా చెప్పకపొయినా చిరంజీవి ఎప్పుడూ నా గుండెల్లో వుండే వ్యక్తి అని పవన్‌కల్యాణ్ వ్యక్తపరచక తప్పలేదు. మొన్న ఇంటర్వ్యూలో చిరంజీవి పేరు చెప్పలేదన్న కామెంట్స్‌కు క్లారిఫికేషన్ అనుకోవచ్చు.
- ఒక్క త్రివిక్రమ్ మినహా ఎవరినీ ఫంక్షన్‌కు ఆహ్వానించినట్టు లేరు. ఫంక్షన్ సింపుల్‌గా వున్నా, అభిమానుల ఉత్సాహంతో గ్రాండ్‌గా అనిపించింది.
- కెమెరా ముందు అందరికీ నవ్వుతూ కనిపించే పవన్‌కల్యాణ్ వేరు .. నిజమైన పవన్‌కల్యాణ్ వేరు. పవన్‌కల్యాణ్‌తో పనిచేసిన వాళ్ళందరికీ తెలుసు. సినిమా కోసం తను కష్టపడతాడు, తన కోసం పని చేసేవాళ్ళను కష్టపెడతాడు. అంతే కాదు, ఎవరికైనా అవసరమైనప్పుడు అండగా నిలబడతాడు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత శరత్ మరార్ తెలియజేయడం హర్ట్ టచింగ్.
httpv://youtu.be/ja_NE8qcats