ట్రైలర్ రివ్యూ

Sardaar-Gabbar-Singh-Theatrical-Trailer-1458490697-1468

గబ్బర్‌సింగ్-1 సినిమా దబాంగ్ సినిమాకు రిమేక్. కథ మొత్తం అందరికీ తెలుసు. అది గొప్ప కథేమి కాదు. క్యారెక్టరైజేషన్ మాత్రం కొత్త. హరీష్‌శంకర్ డైలాగ్స్, టేకింగ్ బాగా వర్కవుట్ అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇంకా అరగదీయడానికి ఏమి మిగలేదు అన్నట్టుగా, గబ్బర్‌సింగ్-1 క్యారెక్టరైజేషన్ తో చాలా తెలుగుసినిమాలు వచ్చేసాయి. ఇంకా “సర్దార్ గబ్బర్‌సింగ్” చెయ్యడం కరెక్ట్ కాదన్న వారు కూడా వున్నారు. అనుకున్నది చేసే దాకా నిద్రపోని పవన్‌కల్యాణ్ సినిమాను ఫినిష్ చేసి, ఏప్రిల్ 8న ప్రేక్షకులకు ముందుకు వస్తున్నాడు. అందరూ వూహించినట్టుగానే గబ్బర్‌సింగ్-1 రేంజ్‌లో వుండదు అనే ఫీల్ కలిగించే విధంగా ట్రైలర్ వుంది.

చిన్న ట్రైలర్‌లో కథ మొత్తం చేప్పేసారు. మూడు రాష్ట్రాల సరిహద్దులో ఉన్న గ్రామం రతన్ పూర్. ఆ ఊరికి బైరవ్ సింగ్ అనేవాడే శాశనుడు. వాడే శాపం. వాడే విలన్. ఇక అదే ఊరిలో ఒక రాజకుమారి. ఒక సంస్థానానికి వారసురాలు కాజల్ అగర్వాల్. వీడి నుండి ఆమెను కాపాడటానికి.. ఎస్సై నుండి సిఐ గా ప్రమోషన్ ఇచ్చి మరీ “గబ్బర్‌సింగ్” ను ఇక్కడ పంపిస్తారు. అప్పుడు ఆ ఒక్కడు ఏం చేశాడనేదే “సర్దార్ గబ్బర్‌సింగ్” సినిమా. దేవిశ్రీ ప్రసాద్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. “ఓయ్ పేరు గుర్తుందిగా.. గబ్బర్‌సింగ్.. సర్దార్ గబ్బర్‌సింగ్” అంటూ పవన్ ఆఖర్లో ఇచ్చిన పంచ్ డైలాగ్ కేక్ పుట్టించింది. పవన్ ఎనర్జీ.. స్టయిల్.. డైలాగులు మెయిన్ ఎసెట్. దర్శకుడు బాబీ టేకింగ్ అదిరిపోయింది.

పవన్‌కల్యాణ్ చెప్పిన మరో రెండు డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి:

పొగరెక్కి తలెగరేసే నీలాంటోడు పుట్టిన ప్రతీసారీ తెగనరకడానికి నాలాంటోడు పుడుతూనే ఉంటాడు

ఒక్కడ్నే.. ఒక్కడ్నే.. ఎక్కడికైనా ఇలాగే వస్తా.. ఇలాగే ఉంటా.. జనంలో ఉంటా జనంలా ఉంటా

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సర్దార్ గబ్బర్‌సింగ్, Featured. Bookmark the permalink.