THAMAN SHIVAKUMAR @MusicThaman
Tat was an awesome day at work with our @alluarjun super promotional plans of the #Sarrainodu audio coming soon 🎶👍
బన్నీని వూర మాస్ కోణంలో చూపిస్తూ దర్శకుడు బోయపాటి శీను తెరకెక్కించిన స్టైలిష్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘సరైనోడు’ ఏప్రిల్ 22న రిలీజ్ అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సమ్మర్‌కు వస్తోన్న సినిమాల్లో దానికంటూ ఓ ప్రత్యేకత తెచ్చుకున్న ఈ సినిమా, టీజర్‌తో మంచి హైప్ సాధించింది. సర్దార్ గబ్బర్‌సింగ్ హాడావుడి దాడికి పబ్లిసిటీ కొద్దిగా తగ్గించారు. ఏప్రిల్ 1న ఆడియోను నేరుగా మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నారు. ఇక విడుదలకు ఇంకా నెల రోజులే ఉండడంతో ఇప్పటికే ఓ పక్క పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేస్తోన్న టీమ్, మరో పక్క సినిమాను భారీగా హైప్ చెయ్యడానికి ప్లాన్ చేస్తుంది. థమన్ సంగీత దర్శకత్వంలో రూపొందిన ఆడియో చాలా బాగా వచ్చిందనే టాక్ వుంది. అల్లు అర్జున్ సరసన రకుల్ ప్రీత్, క్యాథరిన్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మించారు.