ఆయన ఓన్ అవ్వాలంటే ఆయనకు ట్యూన్ అవ్వాలి .. లేదా ఆయనకు ఫ్యాన్ అవ్వాలి
సర్దార్ గబ్బర్‌సింగ్ కు కథ-స్క్రీన్‌ప్లే కథ-స్క్రీన్‌ప్లే పవన్‌కల్యాణే అందించాడు. తన సొంత కథ అవ్వడంతో పవన్‌కల్యాణ్ ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి చేసాడు. డైరక్షన్ మాత్రం పవర్ బాబీనే చేసాడు.కాని పవన్‌కల్యాణ్ ఇవ్వాల్వ్మెంట్ చూసి, పేరుకు మాత్రమే బాబీ డైరక్టర్ అని న్యూస్ స్ప్రెడ్ అయ్యింది (ఇంకా అవుతునే వుంది). బద్రి సినిమాకు కూడా ఇలానే జరిగింది.
ఈ సినిమాకు సంబంధించి డైరక్టర్ పని, తన సొంత విజన్ పక్కన పెట్టి, పవన్‌కల్యాణ్ విజన్‌ను తెరమీదకు ఎక్కించడం మాత్రమే. అలా చెయ్యాలంటే పవన్‌తో కనెక్ట్ అవ్వాలి. అప్పుడే మంచి అవుట్‌పుట్ వస్తుంది.
“పవర్ బాబీ కనెక్ట్ అయ్యాడా?” అంటే, ఆడియో ఫంక్షన్లో శరత్‌మరార్ స్పీచ్‌ను బట్టి, పవన్‌కల్యాణ్‌తో బాబీ బాగా ట్యూన్ అయ్యాడు. పబ్లిసిటీ కోసం బాబీ ఇచ్చే ఇంటర్వ్యూస్‌లో త్వరలో తెలిసిపోతుంది.
చెపుతున్నాడు కాబట్టి చెయ్యాలి అని కాకుండా, బాబీ నిజంగా కనెక్ట్ అయ్యి చేసి వుంటే “సర్దార్ గబ్బర్‌సింగ్” పక్కా సూపర్ హిట్. మాస్కు బాగా నచ్చిన పాటలు, సోషల్ నెట్వర్కింగ్లో జనాలకు స్లోగా ఎక్కుతున్నాయి.