బ్లాక్‌బ‌స్ట‌ర్ సాంగ్ – అదే రేంజ్‌లో వుంది

Screen Shot 2016-03-26 at 8.18.53 AM

మాస్ .. మాస్ .. వూర మాస్ .. అదే రేంజ్‌లో వుంది బ్లాక్‌బ‌స్ట‌ర్ సాంగ్ టీజర్.

నందమూరి అభిమానుల అభిమాన డైరక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ నిర్మిస్తున్న చిత్రం ‘సరైనోడు’. ఏప్రిల్‌ 1న ఈ చిత్రం ఆడియోను నేరుగా మార్కెట్‌లోకి విడుదల చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్ర హీరోగా అల్లు అర్జున్ నటించగా, హీరోయిన్‌గా రకుల్ ప్రీత్ సింగ్ నటించింది. నటి అంజలి ఓ ప్రత్యేక గీతంలో కనిపించనుంది. చిత్ర యూనిట్ ఈ పాటకు సంబంధించిన ప్రోమోను శనివారం విడుదల చేసింది. ఎస్ఎస్.థమన్‌ సంగీతం సమకూర్చిన ‘బ్లాక్‌బస్టరే…’ అంటూ సాగే ఈ పాటకు అల్లు అర్జున్‌ తెగ ఎనర్జిటిక్‌గా స్టెప్పులు వేశాడు. మాస్‌నే కాదు, క్లాస్‌ను కూడా అలరించే విధంగా వుంది ఈ సాంగ్.

httpv://youtu.be/eo3b8NFXfzU

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సరైనోడు, Featured. Bookmark the permalink.