ఇంకో పాటే మిగిలింది

SGS

పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం సర్దార్ గబ్బర్‌సింగ్. పవర్ బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు కెప్టెన్ బాద్యత కూడా పవన్‌కల్యాణే తీసుకున్నాడు. ఈ సినిమాను శరత్ మరార్ నిర్మిస్తున్నారు. పవన్ సరసన కాజల్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఏప్రిల్ 8న ఎలాగైనా రిలీజ్ చెయ్యాలనే ప్రయత్నంలో వున్నారు. ఇంకో పక్క కొంత భాగం రీషూట్ చెయ్యాలంటా & మే నెలకు పోస్ట్‌పోన్ అంటూ రూమర్స్ కూడా వస్తున్నాయి. ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లో పాటల షూటింగ్ జరుగుతోంది. ఇక్కడ రెండు పాటల షూట్ ప్లాన్ చేయగా, ఒక పాట ఇప్పటికే పూర్తైంది. ఇక దానికి సంబంధించిన రషెస్ కూడా పోస్ట్ ప్రొడక్షన్ కోసం హైద్రాబాద్‌కు పంపించేశారని సమాచారం. మిగిలి ఉన్న ఒక్క పాటను కూడా మరో రెండు రోజుల్లో పూర్తి చేసి టీమ్ హైద్రాబాద్ రానుంది. సినిమాను గాలికి వదిలేయకుండా పవన్‌కల్యాణ్‌ను కూడా ఇన్‌వాల్వ్ చేసి ప్రిరిలీజ్ & పొస్ట్ రిలీజ్ పబ్లిసిటీ గట్టిగా చేస్తే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు. పవన్‌కల్యాణ్ మూడ్ మీద ఆధారపడివుంది.

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సర్దార్ గబ్బర్‌సింగ్, Featured. Bookmark the permalink.