ఒక డైరక్టర్‌గా పవన్‌కల్యాణ్ చెప్పినదానికల్లా ఊకొట్టకూడదు. బెటర్‌మెంట్ కోసం వాదించాలి, ఫైనల్‌గా ప్రేక్షకులని మెప్పించే విధంగా కథ చెప్పాలి. బాబీ ఇంటర్వ్యూ ప్రకారం పవన్‌కల్యాణ్‌తో బాగానే కనెక్ట్ అయినట్టు వున్నాడు. అది నిజమైతే మరో పెద్ద హిట్ కొట్టేసినట్టే. బాబీ స్వతహాగా మంచి కథకుడు. కచ్చితంగా పవన్‌కల్యాణ్ అనుకున్నది బెటర్ చేసి వుంటాడు.
ప్రశ్న) పవన్ కళ్యాణ్ రాసిన కథను మీరు డైరెక్ట్ చేయాలంటే ఎలా అనిపించింది?
స) ముందే చెప్పినట్లు పవన్ కళ్యాణ్ గారు రాసిన కథ చాలా బాగా నచ్చింది. దానికి నేను, ఆయన.. ఇద్దరం కలిసి కొన్ని మార్పులు అవీ చేశాం. దాదాపుగా స్ర్కిప్ట్ వర్క్‌పైనే ఐదు నెలలు కూర్చున్నాం.