సర్దార్ గబ్బర్‌సింగ్ పెద్ద పొడిచేసే స్టోరీ ఏమీ కాదు. సింపుల్ .. రోటీన్ .. కాని ఏదో ప్రత్యేకత వుంది. ఆ ప్రత్యేకత ఏమిటో తెలియాలంటే మరో ఆరు రోజులు ఆగాల్సిందే.
స్టోరీ
మూడు రాష్ట్రాల సరిహద్దులో ఉన్న గ్రామం రతన్ పూర్. ఆ ఊరికి బైరవ్ సింగ్ అనేవాడే శాశనుడు. వాడే శాపం. వాడే విలన్. ఇక అదే ఊరిలో ఒక రాజకుమారి. ఒక సంస్థానానికి వారసురాలు కాజల్ అగర్వాల్. వీడి నుండి ఆమెను కాపాడటానికి.. ఎస్సై నుండి సిఐ గా ప్రమోషన్ ఇచ్చి మరీ “గబ్బర్‌సింగ్” ను ఇక్కడ పంపిస్తారు. అప్పుడు ఆ ఒక్కడు ఏం చేశాడనేదే “సర్దార్ గబ్బర్‌సింగ్” సినిమా.
ఈ తరహాలో ఎన్నో తెలుగుసినిమాలు వచ్చాయి. ఖలేజ .. కిక్-2. ఆ రెండు సినిమాలు వేర్వేరు కోణాల్లో ట్రీట్ చేయబడ్డాయి. అలానే సర్దార్ గబ్బర్‌సింగ్ పవన్‌కల్యాణ్ విజన్‌తో ట్రీట్ చేయబడింది.