this mass song from kalyan is surprising

SGS

పవన్‌కల్యాణ్ ఐటమ్ సాంగ్స్ & వూర మాస్ సాంగ్స్ చెయ్యడానికి స్వతహాగా ఇష్టపడడు. సినిమాలో అవి అవసరం కాబట్టి, చెయ్యాలన్న పేరుకు చేస్తాడు. కెవ్వు కేక సాంగ్ కూడా అంత ఇన్‌వాల్వ్ అయ్యి చేసినట్టు అనిపించదు.

సర్దార్ గబ్బర్‌సింగ్‌లో మాత్రం

  1. ఐటమ్ సాంగ్ ఫుల్ ఇన్‌వాల్వ్ అవ్వడంతో పాటు, ఫుల్ జోష్‌తో కూడిన స్టెప్స్ కూడా వేసాడు.
  2. దేవిశ్రీ లిరిక్స్ వ్రాసిన ఒక ఫుల్ మాస్ సాంగ్ చేస్తున్నాడు. ఫస్ట్ టైమ్ విన్నప్పుడు .. దేవిశ్రీ పాత పాటలను గుర్తుకు తెచ్చే విధంగా వుందనిపించినా .. రిపీట్ హియరింగ్స్‌లో మంచి కిక్ ఇచ్చే పాట. విజువల్స్ వచ్చాక, వీర మాస్ హిట్ ఆయ్యే సాంగ్. పవన్‌కల్యాణ్ సొంతంగా వ్రాసుకున్న కథలో ఈ మాస్ సాంగ్ వుండటం కచ్చితంగా బిగ్ సరప్రైజ్. ఈ పాట లిరిక్స్.

హేయ్.. చిన్నదాని చూపులోన సోపు ఉందిరో.. చిన్నదాని చూపులోన సోపు ఉందిరో
ఆ సోపు మీద కాలేసి స్లిప్ అయిందిరో.. నా బుజ్జి బుజ్జి బుజ్జి బుజ్జి బుజ్జి గుండెరో హేయ్

పిల్లగాడి ఒంటి మీద సెంటు వుందిరో.. పిల్లగాడి ఒంటి మీద సెంటు వుందిరో
ఆ సెంటు తాకి నా మనసే అంటుకుందిరో.. అది భగ్గు భగ్గు భగ్గు భగ్గు మండుతుందిరో

హే .. ఓ పిల్ల .. నీబుగ్గే రసగుల్ల .. అబ్బ .. నీవల్ల నేపడ్డా యెల్లకిల్లా

హే .. పిల్లోడ నీమాటే గోలిసోడ .. దిల్ వున్నోడ .. హే రారా పోలిసోడా

ఖాకీ చొక్కా వేసి నడిసొచ్చే మిస్టరు .. లాఠీ పట్టావంటే .. అబ్బో బ్లాక్‌బస్టరు
ఖాకీ చొక్కా వేసి నడిసొచ్చే మిస్టరు .. లాఠీ పట్టావంటే .. అబ్బో బ్లాక్‌బస్టరు

హే .. చిన్నదాని ఇంటికాడ పంపు వుందిరో .. చిన్నదాని ఇంటికాడ పంపు వుందిరో
ఆ పంపుసెట్టు కాడ బింది నింపుతుందిరో .. నింపి ఊపే సూపి ఊపిరాపి సంపుతుందిరో

పిల్లగాడి నడకలోన స్టైలు వుందిరో .. పిల్లగాడి నడకలోన స్టైలు వుందిరో
ఆ స్తైలు చూసి నాఈడే రైలు అయిందిరో.. అది చికు బుకు చికు బుకు బయల్దెరిందిరో

హే … బంగారు నీనవ్వుల్లో సితారు .. నింపేయి ఓమారు ఒళ్ళంతా యమ జోరు

హే .. బంగారం నీముద్దే మహా కారం .. నడిపేయి యవ్వారం నీ హగ్గే కారగారం

ఖాకీ చొక్కా వేసి నడిసొచ్చే మిస్టరు .. లాఠీ పట్టావంటే .. అబ్బో బ్లాక్‌బస్టరు
ఖాకీ చొక్కా వేసి నడిసొచ్చే మిస్టరు .. లాఠీ పట్టావంటే .. అబ్బో బ్లాక్‌బస్టరు

చిన్నదాని సోకు చూస్తే పూల బుట్టరో .. చిన్నదాని సోకు చూస్తే పూల బుట్టరో
ఆ బుట్ట చూసి నా షర్టే ఈల కొట్టేరో .. నా కళ్ళు వొళ్ళు అన్నీ అయ్యో గోల బెట్టేరో

పిల్లగాడి స్పీడు చూస్తే మెరుపు దాడిరో .. పిల్లగాడి స్పీడు చూస్తే మెరుపు దాడిరో
ఆ మెరుపెమో నాలో పెంచింది వేడిరో.. ఓరబ్బో ఈడి కటౌటెమో ఐమాక్స్ 3-డిరో

హే  3-డిలో చూస్తే నీ వయ్యారాలు .. నా పిస్తోలు తెగ వాయిస్తుండే డోలు

హే .. నీ కళ్ళు నన్ను బంధించేయ్ సంకెళ్ళు .. పూల జల్లు నీ తుపాకిలో గుళ్ళు

ఖాకీ చొక్కా వేసి నడిసొచ్చే మిస్టరు .. లాఠీ పట్టావంటే .. అబ్బో బ్లాక్‌బస్టరు
ఖాకీ చొక్కా వేసి నడిసొచ్చే మిస్టరు ..లాఠీ పట్టావంటే .. అబ్బో బ్లాక్‌బస్టరు

httpv://youtu.be/WBDzLemSS34

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సర్దార్ గబ్బర్‌సింగ్, Featured. Bookmark the permalink.