తెలుగుసినిమా రేంజ్‌ను పెంచే సర్దార్ గబ్బర్‌సింగ్

SGS

ఏ పెద్ద సినిమాకైనా ఫ్యాన్స్ చేసే హడావుడితో క్రేజ్ వున్నట్టుగా వుంటుంది. నిజంగా క్రేజ్ వుందా? ఫ్యాన్సే కాకుండా, మిగతా ప్రేక్షకులు కూడా ఇది మన సినిమా అని ఓన్ చేసుకుంటున్నారా అంటే కష్టమెమో. అది ఒక్క బాహుబలికే సాధ్యమైంది. తెలుగువాళ్ళందరూ ఆ సినిమాను సపోర్ట్ చేసినట్టుగా ఏ సినిమాను చెయ్యలేదు. భవిష్యత్తులో చేసే ఛాన్సస్ కూడా వున్నట్టు లేవు. హిరో ఫ్యాన్స్ మధ్య పోటి వలన అది సాధ్యమయ్యే పని కాదు. ఎంత వరకు నిజమో తెలియదు కాని, హిరో అంటే ఇష్టం .. తెలుగు అంటే ఇష్టం .. హిరో ఫ్యాన్స్ చేసే అతి వలన సినిమాను వెటకారం చేస్తుంటాం అని చాలామంది అంటూ వుంటారు. పవన్‌ఫ్యాన్స్.కామ్ మాత్రం, ఫ్యాన్స్ మధ్య పొటీని పక్కన పెట్టి, అన్ని సినిమాలను సపోర్ట్ చేస్తుంది.

ఇప్పుడు సర్దార్ గబ్బర్‌సింగ్ తెలుగు & హిందీ బాషల్లో రిలీజ్ అవుతుంది. ఎంతమంది తెలుగువాళ్ళు ఇది మా సినిమా అని ఫీల్ అవుతున్నారంటే, మెగాఫ్యాన్స్ మినహా ఎవరూ ఫీల్ అవటం లేదని కచ్చితంగా చెప్పవచ్చు. ఎవరు ఫీల్ అయినా, కాకపొయినా, బాహుబలి బాటలో తెలుగుసినిమా రేంజ్‌ను పెంచే ప్రయత్నం చేస్తున్న పవన్‌కల్యాణ్‌కు థాంక్స్.

త్రివిక్రమ్ ఆశీస్తున్నట్టు “సర్దార్ గబ్బర్‌సింగ్” తెలుగుసినిమా రేంజ్‌ను మరింత పెంచే సినిమా కావాలి.

httpv://youtu.be/VNzls62cDG8

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సర్దార్ గబ్బర్‌సింగ్, Featured. Bookmark the permalink.