ట్రైలర్ చూసి పాత కథే అన్నారు .. పాటలు బిలో ఎవరేజ్ అన్నారు .. పవన్‌కల్యాణ్ కథ-స్క్రీన్‌ప్లే కాబట్టి కమర్షియల్ ఎలిమెంట్స్ వుండవు అన్నారు .. హైప్ క్రియేట్ అవ్వదు అనుకున్నారు. కాని ఇప్పుడు సినిమా మీద సూపర్ పాజిటివ్ హైప్ క్రియేట్ అయ్యింది. పవన్‌కల్యాణ్ & టీమ్ పడుతున్న కష్టాన్ని, అందరూ బాగానే గుర్తించారు.
చాలా లేటుగా పబ్లిసిటీ స్టార్ట్ చెయ్యడం వలన హైప్, జానీ & బాహుబలి అంత లేదు కాని, మహేష్‌బాబు & శ్రీనువైట్ల కాంబినేషన్లో వచ్చిన ఆగడు(ఇది కూడా గబ్బర్‌సింగ్-2నే) సినిమాకు ఎంత హైప్ క్రియేట్ అయ్యిందో, ఇప్పుడు సర్దార్ గబ్బర్‌సింగ్ కూడా అంతే క్రియేట్ అయ్యింది. అమెరికాలో ప్రిమియర్ కలక్షన్స్ ఏ రేంజ్‌లో వుంటాయో చూడాలి.