గబ్బర్‌సింగ్-1 ద్వారా పవన్‌కల్యాణ్‌కు ఎంత పేరు వచ్చిందో, హరీష్‌శంకర్‌కు కూడా అంతే పేరు వచ్చింది. సర్దార్ గబ్బర్‌సింగ్ చేసే అవకాశం మాత్రం రాలేదు. బహుశా ప్రయత్నం చెయ్యలేదో, రెమ్యూనరేషన్ పెంచేసాడో, పవన్‌కల్యాణ్ అదే కాంబినేషన్ రిపీట్ చేయకూడదు అనుకున్నాడో, కరెక్ట్ కారణం పవన్‌కల్యాణ్ చెపితే కాని తెలియదు. చెప్పడు.
హరీష్‌శంకర్ చేసివుంటే.. ఇప్పుడు వచ్చిన హైప్ ఫ్యాన్స్‌కే పరిమితం కాకుండా, సామాన్య ప్రేక్షకుల్లో కూడా వచ్చేది. సినిమా పబ్లిసిటీ కూడా వేరే రేంజ్లో వుండేది.
bottomline:
పవన్‌కల్యాణ్-హరీష్‌శంకర్ కాంబినేషన్లో మరో సినిమా అభిమానులు కోరుకుంటున్నారన్న మాట వాస్తవం. థమన్ మ్యూజిక్(థమన్ హరీష్‌శంకర్‌కు మంచి మ్యూజిక్ ఇస్తాడు) అయితే ఇంకా సూపర్.