అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘సరైనోడు’ ఏప్రిల్ 22న భారీ ఎత్తున విడుదలకు సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. భోయపాటి శీను తెరకెక్కించిన ఈ స్టైలిష్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు సంబంధించిన ఆడియో ఇప్పటికే మార్కెట్లో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక ఈ నేపథ్యంలోనే ‘సరైనోడు’ టీమ్ నేడు వైజాగ్‌లో ఓ భారీ ప్రీ రిలీజ్ వేడుక జరిగింది. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా వచ్చారు.సినిమాకు ఆడియో రిలీజ్ వేడుక కూడా జరపక పోవడంతో ఈ ఈవెంట్ ప్రత్యేకత తెచ్చుకుంది. ఈ వేడుకలో అల్లు అర్జున్ స్ఫీచ్ అందరినీ ఆకట్టుకుంది. సరదాగా సాగింది. “బ్రతక నేర్చినోడు ఈ సరైనోడు” అని సరదాగా మెగాఫ్యాన్స్ అంటున్నారు.
”
‘ఈ వెదర్ కి సూట్ కాకపోయినా స్టైలిష్ స్టార్ అంటారని సూటేసుకొచ్చా…అదేమో తడిసిపోయింది’
‘తమన్ మనిషి ఎంత సాలిడ్ గా ఉంటాడో, అతని మ్యూజిక్ కూడా అంతే సాలిడ్ గా ఉంది’
‘కెమెరామేన్ రిషీ పంజాబీ లేకుండా ఈ సినిమాను ఊహించలేను’
‘ఈ సినిమా ప్రారంభమైనప్పటి నుంచి దీని ఆడియో వేడుక వైజాగ్ లో చేయాలని అనిపించేది, అంత బలమైన కోరిక ఇప్పుడు నెరవేరినందుకు సంతోషంగా ఉంది’
‘ఈ సినిమాలో ఈ పాత్రను తన కోసం కాకుండా, మా కోసం అంగీకరించిన శ్రీకాంత్ అన్నయ్యకు ధన్యవాదాలు’
‘బోయపాటి హీరోను బట్టి ఇమేజ్ డిజైన్ చేస్తారు’
‘తన సినిమా అంటే తన తండ్రి ప్రతి రూపాయికి మరో మూడు రూపాయలు ఎక్కువ పెడతారు. కొడుక్కి పెట్టకపోతే ఎవరికి పెడతారు’
‘తాము కార్లలో తిరిగేందుకు రోడ్డెసిన వ్యక్తి చిరంజీవి’
‘ఈ సినిమా ఊరమాస్ ఫ్యామిలీ సినిమా’
–AA
httpv://youtu.be/UOlVSuFJWzc