అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం సరైనోడు. అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బోయపాటి శ్రీను దర్శకుడు. రకుల్‌ప్రీత్‌సింగ్, కేథరిన్ కథానాయికలు. ఈ నెల 22న రిలీజ్ అవుతున్నట్టుగా ఆఫీషియల్‌గా మొన్న ఆడియో విజయోత్సవ సభలో అన్నయ్య చిరంజీవి ప్రకటించిన సంగతి అందరకీ తెలిసిందే.
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడు కావడంతో S/Oసత్తమూర్తితో అల్లు అర్జున్ వందకోట్ల హిరో అవుతాడు అనుకున్నారు కాని, రీచ్ కాలేకపొయాడు. ఈసారి సరైనోడుతో శ్రీమంతుడిని దాటుకొని వంద కోట్లు రీచ్ అయిపొతాడని మెగా ట్రేడ్ పండితులు ఊహిస్తున్నారు.
నందమూరి అభిమానుల అభిమాన డైరక్టర్ బోయపాటి ఈ సినిమాకు దర్శకుడు కావడం పెద్ద ఏడ్వాంటేజ్. అల్లు అరవింద్ నిర్మాత కావడం మరో పెద్ద ఏడ్వాంటేజ్. మాస్ ప్రేక్షకులతో పాటు క్లాస్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకునే విధంగా వుంటే, మెగా ట్రేడ్ పండితుల ఊహాగానాలు నిజం అయ్యే అవకాశాలు లేకపొలేదు.