- అతడు సినిమాతో మహేష్‌బాబుకు సరికొత్త ఇమేజ్ క్రియేట్ చేసాడు. ఆ ఇమేజ్‌తో పొకిరి లాంటి ఇండస్ట్రీ హిట్ కొట్డాడు మహేష్‌బాబు.
- పవన్‌కల్యాణ్ ఫ్లాపులు మీద ఫ్లాపులతో తమిళ్ డైరక్టర్స్ మీదే ఫుల్‌గా డిపెండ్ అయిపొతున్నాడనుకుంటున్న సమయంలో జల్సాతో, పవన్‌కల్యాణ్ ఫ్లాప్ సినిమాలకు బ్రేక్ వేసాడు.
- జులాయి సినిమాతో అల్లు అర్జున్ పెద్ద హిరో రేంజ్‌కు ఏమీ తక్కువ కాదు అని త్రివిక్రమ్ శ్రీనివాస్ చూపిస్తే, రేసుగుర్రంతో ఇండస్ట్రీ హిట్ రేంజ్ సినిమా ఇచ్చాడు అల్లు అర్జున్.
- ఇప్పుడు నితిన్ రేంజ్ పెంచే ప్రయత్నంలో “అ.. ఆ” వస్తుంది.
‘అ ఆ’ అంటే ‘అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారి. ఆనంద్ విహారి పాత్రలో నితిన్ నటిస్తుండగా…అనసూయ రామలింగం పాత్రలో సమంత నటించింది. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను నితిన్ సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు.
- త్రివిక్రమ్ మార్క్‌తో చూడగానే ఆకట్టుకునే విధంగా చూడముచ్చటగా ఈ టీజర్‌తో ఉంది.
- నితిన్, సమంత ట్రైన్‌లో ప్రయాణిస్తూ..ఒకరినొకరు పరిచయం చేసుకుంటారు.
- ‘అ ఆ’ అనే పక్కపక్కనుండే రెండు అక్షరాల పరిచయానికి పాతికేళ్లు పట్టింది అంటోంది సమంత.
మేలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో నితిన్, సమంత, అనుపమ పరమేశ్వరన్‌లతో పాటు నదియ, అనన్య, ఈస్వరీరావు, సన, గిరిబాబు, నరేష్, రావురమేష్ ,పోసాని, అవసరాల శ్రీనివాస్, రఘుబాబు, ప్రవీణ్, శ్రీనివాస రెడ్డి కీలకపాత్రలో నటించారు.
httpv://youtu.be/aFNx2ydeowA