మెగా హిరోల సినిమాలు పెద్దగా గ్యాప్ లేకుండా రిలీజ్ చేసేస్తున్నారు. ఈ నెల 8న పవన్ ‘సర్దార్’గా ఎంట్రీ ఇవ్వగా, 22న ‘సరైనోడు’గా అల్లు అర్జున్ తెరమీదికి రానున్నాడు. వీరితోపాటు మరో మెగా హీరో సాయి ధరమ్ తేజ సైతం ‘సుప్రీమ్’గా ఈ వేసవిలో అలరించనున్నాడు. పటాస్ ఫేం అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శిరీష్ నిర్మించారు. ‘దిల్’ రాజు సమర్పకుడిగా వ్యవహరిస్తోన్న ఈ సినిమాలో రాశిఖన్నా నాయికగా నటించింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. సాయి కార్తీక్ సంగీతమందించిన పాటలు ఈరోజు శిల్పకళావేదికలో విడుదల కానున్నాయి.
సినిమా మీద హైప్ తీసుకొని రావడానికి, మెగాస్టార్ చిరంజీవి ‘యముడికి మొగుడు’ చిత్రంలో ‘సుప్రీమ్ హీరో’ అంటూ మొదలయ్యే పాపులర్ సాంగ్ ‘అందం హిందోళం…’ రీమిక్స్‌ను ఈ ‘సుప్రీమ్’ సినిమాలో వాడుకుంటున్నారు.
httpv://youtu.be/NIF9LCe3emI