హిట్ గ్యారంటీ .. ఏ రేంజ్ హిట్?

AA

సరైనోడు హిట్ గ్యారంటీ .. ఏ రేంజ్ హిట్ అనే దాని కోసమే వెయిటింగ్ అన్నట్టు వుంది ప్రస్తుతం పరిస్థితి. వూర మాస్ అంటున్నారు. వూర మాస్ అంటే, ఫైట్స్ చూస్తున్నప్పుడు కొద్దిగా అతిగా అనిపించినా ప్రతి ప్రేక్షకుడి మనసులో “అదిరా .. మన శత్రువులని ఇలా కొట్టాలి” అని అనిపిస్తుందని ఊహిస్తున్నారు.

ప్రేక్షకుల టేస్ట్ కొద్ది కొద్దిగా మారుతుంది. వూర మాస్ ఒక్కటే వుంటే పెద్దగా ఇంటరెస్ట్ చూపించడం లేదు. కాకపొతే బన్ని ఫుల్ ఫార్మ్‌లో వుండటంతో పాటు, రుద్రమదేవి సినిమా సరికొత్త అభిమానులను సంపాదించుకున్నాడు. వూర మాస్‌ను బన్నీ ఇమేజ్ బ్యాలెన్స్ చేస్తుంది.

ట్రైలర్లో చూపిస్తున్న వూరమాస్‌కు ఫ్యామిలీ సెంటిమెంట్ పండితే, పెద్ద హిట్ గ్యారంటీ. రిపీట్ ప్రేక్షకులు కోరుకునే ఎంటర్‌టైన్‌మెంట్ కూడా బన్నీ మేనరిజమ్స్‌తో కవర్ చేసి వుంటాడు. పాటలు బోనస్.

హిట్ గ్యారంటీ .. ఏ రేంజ్ హిట్? అనేది తెలియాలంటే ఏప్రిల్ 22 వరకు, అంటే మరో వారం ఆగాల్సిందే.

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సరైనోడు. Bookmark the permalink.