అటు పవన్‌కల్యాణ్ అభిమనులు, ఇటు మహేష్‌బాబు అభిమానులకే కాదు, ప్రతి తెలుగోడికి అభిమాన దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ప్రతి హిరో అభిమానులు, త్రివిక్రమ్ తమ హిరోతో ఒక సినిమా చెయ్యాలని కోరుకుంటూ ఉంటారు. రెమ్యూనరేషన్ విషయంలో కాని, కథ విషయంలో కాని రాజీ పడడు కాబట్టి, అభిమానుల కలలు నిజం అవ్వాలంటే చాలా టైం అవసరం.
ప్రస్తుతం త్రివిక్రమ్ చేస్తున్న “అ .. ఆ” టీజర్ నిన్న రిలీజ్ అయ్యి మంచి ఫీల్‌ను సెట్ చేసింది. రిలీజ్ ఎప్పుడు? అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. మే 6 అన్నారు కాని, సందట్లో సడేమియా అంటూ ఈ హాడావుడిలో రిలీజ్ చేసి పోటిపడే కంటే, కరెక్ట్ డేట్‌కు రిలీజ్ చేసి మంచి కలక్షన్స్ తెచ్చుకుంటే బాగుంటుందని సినిమా అభిమానులు అనుకుంటున్నారు.