హిరో సాయిధర్మ్‌తేజ్ వై.వి.యస్ చౌదిరి & రవి కుమార్ చౌదిరిలకు ఎంతో ఋణపడి వున్నాడు. “రేయ్” సినిమాతో ఒకరు అవకాశం ఇచ్చి ఎలా నటించాలో నేర్పిస్తే, “పిల్లా నువ్వు లేని జీవతం” ద్వారా మరోకరు అద్భుతమైన స్క్రీన్‌ప్లే వున్న స్క్రిప్ట్‌తో హిట్ సినిమాను ఇచ్చాడు. ఈ రెండు సినిమాలు, ప్రముఖ తెలుగు దర్శక నిర్మాతల్లో సాయిధర్మ్‌తేజ్‌పై మంచి నమ్మకం కలిగించాయి.
గబ్బర్‌సింగ్ హరీష్‌శంకర్ “సుబ్రమణ్యం ఫర్ సేల్” సినిమా సూపర్‌హిట్ అవ్వకపొయినా, మాస్ హిట్ అనిపించుకొని, మాస్‌లో మంచి పునాది వేసింది. ఇప్పుడు పటాస్ ఫేం అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న “సుప్రీమ్” , ‘పటాస్ ’ స్థాయికి ఏం మాత్రం తగ్గకుండా వుండి, సాయిధర్మ్‌తేజ్‌కు సూపర్‌హిట్ సినిమా నిలుస్తుందని, ఆ సినిమా యూనిట్ ఎక్సపెట్ చేస్తున్నారు. ఏప్రిల్ 29న రిలీజ్ అనుకుంటున్న ఈ సినిమాలో పాటలు బాగానే వున్నాయని టాక్ సంపాదించుకున్నాయి.