రెండు పడవలపై ప్రయాణం కష్టం

PK

ఒక పక్క సినిమాలు, మరో పక్క రాజకీయాలు.. ఇలా రెండు పడవలపై ప్రయాణం చాలా కష్టం.

సర్దార్ గబ్బర్‌సింగ్ ఫెయిల్ అయినందుకు పవన్‌ఫ్యాన్స్ ఒక రోజు డీలా పడినా, పవన్‌కల్యాణ్ మనసులోని మాటలు ఇంటర్వ్యూస్ ద్వారా తెలుసుకొన్నందుకు చాలా హ్యాపిగా ఫీల్ అవుతున్నారు.

డైరక్టర్ విజన్‌లో డైరక్టర్ చెప్పింది చెప్పినట్టు చెయ్యలేను .. నేను చేయగల్గే విధంగా నాకు నచ్చినట్టు చేస్తాను.
నాకొచ్చిన నాలుగు స్టేప్పలే అటూ ఇటూ మార్చి చేయగలను .. కొత్తవి చేయలేను .. కొత్తవి చెయ్యను.
రచయితలు తయారు చేసిన కథల్లో ఇమడలేను .. నేను ఇచ్చిన లైనులో కథను చేయగల రచయితలతోనే చేయగలను. వాళ్ళతోనే చేస్తాను.
పవన్‌కల్యాణ్

ఈ ఆంక్షలే కాదు, పలానా దర్శకుడితో సినిమా చెయ్యాలనే ఆశ/కోరిక కూడా లేదు. పవన్‌కల్యాణ్ తనకు తాను అన్ని ఆంక్షలు విధించుకుంటే సినిమాలు చెయ్యడం దేనికి? ఏ దర్శకుడు చేయగలడు? ఇంత అయిష్టంతో సినిమాలు చేయవలసిన అవసరం ఏమిటి? ..

చిరంజీవి మాదిరి, జస్ట్ ఎన్నికల ముందు వచ్చి ప్రజా సమస్యలు మొత్తం తెలేసేసుకుంటాను అనుకుంటే ఎలా? 2019 ఎన్నికలు, 2018 చివరి వరకు సినిమాలు చేసుకుంటాను అనే ఆలోచనే పెద్ద తప్పు. మెగాఫ్యాన్స్‌ను సినిమాల ద్వారా ఎంటర్‌టైన్ చెయ్యడానికి రామ్‌చరణ్ వున్నాడు, బన్ని వున్నాడు, సాయిధర్మ్‌తేజ్ వున్నాడు, వరుణ్‌తేజ్ వున్నాడు. మెగాస్టార్ కూడా తిరిగి వస్తున్నాడు.

ఇప్పుడు పవన్‌కల్యాణ్ చూపిస్తున్న ఆసక్తికి అనుగుణంగా, యస్.జె.సూర్యతో చేస్తున్న సినిమా కూడా ఆపేసి, తక్షణమే రాజకీయల్లోకి వచ్చేసి తెలుగు ప్రజల సమస్యలపై స్పందించాలని పవన్‌ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. నిజానికి ప్రజలు, తమ సమస్యలపై పొరాడే రాజకీయ నాయకులు కావాలని కాని, రావాలని కాని కోరుకొవడం లేదు.

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in Pawan Kalyan. Bookmark the permalink.