సినిమా : సరైనోడు.
స్టోరీ-స్క్రీన్ ప్లే-దర్శకుడు : బోయపాటి శ్రీను
నిర్మాత : అల్లు అరవింద్
మ్యూజిక్ : ఎస్ఎస్ థమన్
బ్యానర్ : గీతా ఆర్ట్స్
రిలీజ్ డేట్ : 22-04-2016.
సెన్సార్ వాళ్లు ‘A’ సర్టిఫికెట్ ఇచ్చారు. మేం ‘U/A’ కోరుకొన్నాం. అలా రావాలంటే కొన్ని సన్నివేశాల్ని తీసేయమన్నారు. కానీ ఆ సన్నివేశాల్ని తీసేస్తే కథ దెబ్బతింటుంది. అందుకే అవే సన్నివేశాల్ని కాస్త డోసు తగ్గించి మళ్లీ తీశాం.
—బోయపాటి
మగధీర సినిమాకు ముందు రాజమౌళి సినిమా అంటే వయలెన్స్‌తో పాటు బూతులు & వల్గారిటీ చాలా ఎక్కువ వుండేవి. మగధీర సినిమాకు “A”(సెన్సార్ సర్టిఫికేషన్) వచ్చినా, బూతులు & వల్గారిటీ లేదనే చెప్పవచ్చు. మగధీర మొదలుకొని యూనివర్సల్‌గా తెలుగు ప్రేక్షకులందరూ రాజమౌళిని లైక్ చేయడం మొదలుపెట్టారు. మగధీర తర్వాత అందుకు తగట్టుగానే సినిమాలు ఇస్తూ, బాహుబలితో ఇండియా అంతా వ్యాపించి ఎవరికీ అందని స్థాయికి వెళ్ళిపొయాడు.
సరైనోడు సినిమాకు ముందు బోయపాటి సినిమాలన్నీ “A”(సెన్సార్ సర్టిఫికేషన్) సినిమాలేనంట. బూతులు, వల్గారిటీ రాజమౌళి రేంజ్‌లో వుండకపొయినా, వయలెన్స్ మాత్రం రాజమౌళిని మించి వుండేది. పిల్లలు అసలు చూడలేరు. బోయపాటికి సరైనోడు సినిమాతో, తెలుగు ప్రేక్షకుల నుంచి రాజమౌళికి మగధీరతో వచ్చిన యూనివర్సల్ లైకింగ్ వస్తుందో రాదో తెలిసేది ఈరోజే.