పవన్‌కల్యాణ్ పేరు చెప్పను – అల్లు అర్జున్

Allu Arjun

అల్లు అర్జున్ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మించిన ‘సరైనోడు’ చిత్రం ఇటీవల విడుదలై రికార్డు కలెక్షన్లతో సూపర్‌హిట్ అయ్యింది. బోయపాటి ఏమి నమ్మి సినిమా చేసాడో, ప్రేక్షకులు కూడా అదే చూస్తున్నారు. సినిమాలో చావులు లెక్కకు మించి వున్నాయని కచ్చితంగా అందరూ చూడదగ్గ సినిమా కాదనే టాక్‌తో మొదలయ్యింది కాని, లెక్కకు మించిన చావులతో పాటు, ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలు ఈ సినిమాలో వుండటంతో పాటు, పబ్లిసిటీ కూడా బాగా చెయ్యడంతో సూపర్‌హిట్ అనిపించుకుంది.

ఈ సినిమాతో అల్లు అర్జున్ కు తన మీద తనకు నమ్మకం పెరిగింది. పవర్‌స్టార్ పవర్‌స్టార్ అని అరుస్తుంటే, ఏమి సమాధానం చెప్పాలో ఫిక్స్ అయిపోయి వచ్చినట్టు వున్నాడు “పవన్‌కల్యాణ్ పేరు నేను చెప్పను .. ఏమి పిక్కుంటారో పీక్కొండి” అని అంటున్నాడు.

గేలి బ్యాచ్‌కు ఆ సమాధానం కరెక్ట్ అని కొందరు అంటుంటే, “సమన్వయం పాటించి ఇగ్నోర్ చెయ్యకుండా .. పవన్ అభిమానులను ఇలా రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం సరి కాద”ని కొందరు అంటున్నారు. హిట్ సినిమా మాత్రమే చూసే వాళ్ళు సినిమా ప్రేక్షకులు, హిట్ ఫట్‌తో సంబంధం లేకుండా సినిమా చూసే వాళ్ళే అభిమానులు అనే విషయం మర్చిపోయి, స్పీచ్ స్టార్ట్ చెయ్యడం కూడా మెగా అభిమానులు అని కాకుండా, తెలుగు సినిమా ప్రేక్షకులు అని స్టార్ట్ చెయ్యడం కూడా మెగా అభిమానులను అవమానించే విధంగానే వుందని మెగా అభిమానులు అనుకుంటున్నారు. కేవలం పవన్ అభిమానులనే కాదు, మెగా అభిమానులను కూడా అవమానించే విధంగా అల్లు అర్జున్ తీరు వుందంటున్నారు.

చిరంజీవి వలనే గీతా ఆర్ట్స్ అనే విషయం పక్కన పెట్టి, మొన్న గీతా ఆర్ట్స్ చిరంజీవికి ఎంతో చేసినట్లుగా మాట్లాడి చిరంజీవి అభిమానుల ఆగ్రహానికి గురి అయిన అల్లు అర్జున్, ఈరోజు ఇలా పవన్ అభిమానుల అగ్రహానికి గురి కావడం తనకే నష్టం అని అల్లు అర్జున్ శ్రేయాభిలాషులు హెచ్చరిస్తున్నారు.

మెగా అభిమానులకు తనకంటే రామ్‌చరణే ఎక్కువ అని గుర్తించి “మెగా అభిమానుల అండ అవసరం లేదు .. సినిమా ప్రేక్షకుల అండ చాలు” అని అంటున్న అల్లు అర్జున్ గట్స్‌కు హట్సాఫ్!!!

httpv://youtu.be/25q0quLf0QQ

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సరైనోడు. Bookmark the permalink.

4 Responses to పవన్‌కల్యాణ్ పేరు చెప్పను – అల్లు అర్జున్

 1. sravan అంటున్నారు:

  అల్లు అర్జున్‌కు వ్యక్తిగతంగా, ప్రత్యేకమైన ఇమేజ్, ఫ్యాన్స్ ఉన్నమాట నిజమే అయినప్పటికీ, అతను ఫంక్షన్‌లో అన్న మాటలు మెగా ఫ్యాన్స్‌ను హర్ట్ చేసేవిధంగా ఉన్నాయి. పవన్ ఫ్యాన్స్ చిరంజీవి ఫంక్షన్ లోనే గొడవచేస్తుంటారు. దానిని ఇతను సీరియస్‌గా తీసుకోవటం తప్పు. Already మెగాస్టార్ అయిపోయినట్లు, heightsకు చేరిపోయినట్లు భావిస్తున్నాడు. చిరంజీవి తామందరికీ రోడ్డు వేశారని చెబుతూనే ఈ మాటలేమిటి.

 2. sravan అంటున్నారు:

  అల్లు అర్జున్ సోషల్ మీడియాను ఫాలో అవుతున్న, లైక్ చేసిన మెగా ఫ్యాన్స్ అందరూ దానిని అన్ లైక్(unlike) చేస్తే తెలిసొస్తుంది.

 3. sravan అంటున్నారు:

  అతని ప్రసంగం మొత్తంలో మెగా ఫ్యాన్స్ అన్న పదం వాడకపోవటంకూడా వ్యూహాత్మకంగానే అన్నట్లు కనబడుతోంది. ఏది ఏమైనా అంత బలుపు పనికిరాదు. మెగా పరిధిని దాటిపోయేంత పెద్ద స్టార్ అయ్యే స్థాయిమాత్రం అతనికి లేదని ఢంకా బజాయించి చెప్పొచ్చు. బేస్ వాయిస్ లేదు, కాస్త పొడుగు డైలాగు చెబితే కామెడీ చేసినట్లు ఉంటుంది. ఈ మైనస్ లన్నీ మరిచిపోతే ఎలా. నంబర్ వన్ అయ్యే స్థాయి మాత్రం లేదని అతను గుర్తుంచుకోవాలి. సాయి ధరమ్ తేజ్‌కు ఇతనికంటే ఎక్కువే ఈజ్ ఉంది.

 4. sravan అంటున్నారు:

  అరవింద్ వల్లే చిరంజీవి మెగాస్టార్ అయ్యారని హరిగారు అనటం కరెక్ట్ కాదు. ఇద్దరూ mutualగా benefit అయ్యారు. కానీ, ప్రజారాజ్యంలో అరవింద్ చేసిన డేమేజ్, ఆ పార్టీకే కాదు చిరంజీవి సామాజికవర్గానికి కూడా కొన్ని ఏళ్ళవరకు కోలుకోలేని విధంగా దెబ్బ కొట్టిన విషయం అందరికీ తెలిసిన సంగతే.

  అంతెందుకు ఇప్పుడు ఫామ్‌లో ఉన్నాడు కాబట్టి రెచ్చిపోతున్న అల్లు అర్జున్, రేెపు రెండు ఫ్లాపులొస్తే పవన్ కాళ్ళు పట్టుకోవటానికి వెనకాడడు.

వ్యాఖ్యలను మూసివేసారు.