‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ వంటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తర్వాత దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల, మహేష్ కాంబినేషన్లో వస్తున్న ‘బ్రహ్మోత్సవం’, మహేష్ బాబు ‘శ్రీమంతుడు’ వంటి హిట్ చిత్రం తర్వాత వస్తుండటంతో ఎలా వుంటుందో అనే భారీ అంచనాలతో పాటు, ముకుంద తర్వాత అడ్డాల శ్రీకాంత్ సినిమా అవ్వడంతో చాలా అనుమానాలు కూడా వున్నాయి. నిన్నటితో షూటింగ్ పూర్తి చేసుకున్న ‘బ్రహ్మోత్సవం’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.
ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ లో జె ఆర్ సి కన్వెన్షన్ సెంటర్ లో ’బ్రహ్మోత్సవం’ పాటలను వేడుకనుఘనంగా నిర్వహించారు. ఈ సినిమాకి మిక్కీ జె.మేయర్ సంగీతాన్ని సమకూర్చిన విషయం తెలిసిందే. కుటుంబంలోని అనుబంధాలను, ఆప్యాయతలను కళ్లకు కట్టినట్టు చూపినట్లు చెబుతున్న ఈ సినిమాను పివిపి సంస్థ భారీ స్థాయిలో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ సరసన కాజల్ అగర్వాల్, సమంత, ప్రణీత నటిస్తున్నారు.
మహిళా లోకాన్ని ఆకట్టుకునే విధంగా వుంది ట్రైలర్.
httpv://youtu.be/awI21cZggpk