ఇంటర్వ్యూ బాగుంది. అనుకోకుండా జరగాలి తప్ప, అనుకుంటే జరగవు అంటున్నాడు. ఈ మూడు జరగనట్టే అన్నమాట.
- పవన్‌కల్యాణ్‌తో సినిమా. (పవన్‌కల్యాణ్‌ను మెప్పించే “సర్దార్ గబ్బర్‌సింగ్” లాంటి కథలు వెతకడం వల్లకాక, చేతులెత్తేసినట్టు వున్నాడు.)
- దేవిశ్రీ ప్రసాద్ హిరోగా సుకుమార్ సినిమా.(సినిమా ప్రమోషన్ కోసం ఆ క్షణంలో ఆవేశంతో సుకుమార్ అన్న విషయం అని నిజం చెప్పకనే చెపుతున్నాడు.)
- నెక్స్ట్ సినిమా ‘శతమానం భవతి’ జనవరి 14, 2017 రిలీజ్. (దిల్ రాజుకు పెద్ద సినిమాలకు ఎదురుగా రిలీజ్ చేసే ధైర్యం లేదని రాజ్ తరుణ్ కూడా గ్రహించేసినట్టు వున్నాడు. రాజ్ తరుణ్ ను ఈ విధంగా భయపెట్టి, డేట్స్ సంపాదించాలని ప్రయత్నం చేసున్నట్టు వుంది.)
జోక్స్ పక్కన పెడితే, తను డైరక్షన్ చేయగలడు(హిట్టా ఫట్టా తర్వాత సంగతి). రెండు సంవత్సరాలు మిగతా పనులన్నీ పక్కన పెట్టాలని చేయడం ఇష్టం లేదంటున్నాడు.
ఈ విషయం పవన్‌కల్యాణ్‌కు కూడా తెలుసు. అయినా కాని, సర్దార్ గబ్బర్‌సింగ్ కథ కోసం అమూల్యమైన రెండు సంవత్సరాలు వేస్ట్ చేయడమే కాదు, మెంటల్ టెన్షన్ కూడా. సినిమాల్లోనే వుంటే ఇటువంటి ప్రయత్నాలు చేయవచ్చు. ఎప్పుడైనా సినిమాలు చేయడం ఆపేయాలన్న నిర్ణయంకు, సొంత కథలతో సొంతంగా వ్రాయవలసిన అవసరం వుందా అని పవన్‌ఫ్యాన్ అంటున్నారు.
httpv://youtu.be/VdK2BWPerrk