చిరంజీవి తమ్ముడు
చిరంజీవి గారి అబ్బాయ్
ఇగో c/o Pawan Kalyan అని పవన్‌కల్యాణ్‌తో పనిచేసిన ఏ టెక్నీషియన్‌ను అడిగినా, ఏ యాక్టర్‌ను అడిగినా తెలుస్తుంది. కేవలం ప్రకాష్‌రాజు లాంటి వాళ్ళు మాత్రమే బయటకు చెప్పే ధైర్యం చేయగలరు. బాబాయ్ మాదిరి పైకి కనిపించకపొయినా, బాబాయ్‌కు ఏ మాత్రం తక్కువ కాదు అంటున్నాడు అబ్బాయ్ చరణ్.
ఆ మాత్రం ఇగో లేకపొతే ఎలా అనే వాళ్ళు కొంతమంది అయితే, మంచి సినిమాలు చెయ్యాలంటే ఇగో వుండకూడదని అనే వాళ్ళు కొంతమంది.
ఇంతకీ చెప్పచ్చేదేమిటంటే, తనతో సినిమాలను తీయడానికి ఉత్సాహం చూపించే దర్శకులతో తప్ప, మంచి దర్శకుల దగ్గరకు వెళ్ళి నాతో సినిమా చెయ్యండని అడిగే అలవాటు బాబాయ్‌కు లేదు. నేను బాబాయ్‌నే ఫాలో అవుతాను అంటున్నాడంట రామ్‌చరణ్ కూడా.
bottomline:
చిరంజీవి కష్టపడి సంపాదించుకున్న మెగాఫ్యాన్స్ సపోర్ట్ వున్న వీళ్ళకు ఆ మాత్రం ఇగో లేకపొతే మెగాఫ్యాన్స్ ఎలా కాలర్ ఎగరేసుకొని తిరగ గలరు?
ఫ్యాన్స్ తమ అభిమాన హిరో ఇలానే వుండాలని కోరుకుంటారు.