సినిమాల మీద విరక్తి — "అ.. ఆ" మీద ప్రభావం

Trivikram

పెద్ద హిరోల సినిమా డిజాస్టర్ ఫ్లాప్ అయినా, అభిమానులు గర్వంగా చెప్పుకొవడానికి సినిమాలో ఎదోకటి వుండాలి. సర్దార్ గబ్బర్‌సింగ్‌లో ప్రయత్నం అయితే జరిగింది కాని, కాలం కలిసిరాక బెడిసి కొట్టాయి. ఆవేశంతో ఎదురుచూసిన మెగా అభిమానులకు సినిమాల మీద విరక్తి వచ్చింది. (దాని ప్రభావం సరైనోడు బెనిఫిట్ షోస్ & ఫ్యాన్స్ షోస్ మీద పడింది. మెగాఫ్యాన్స్ ఎవరూ ఆసక్తి చూపలేదు. ఆ విషయాన్ని అల్లు ఫ్యామిలీ అపార్దం చేసుకొని, మెగాఫ్యాన్స్‌ను దూరం చేసుకుంటున్నారు. ఇది వేరే విషయం అనుకోండి.)

పూరి జగన్నాధ్ & త్రివిక్రమ్ లాంటి దర్శకులు మహేష్‌బాబుతో సినిమా చెయ్యడానికి రెడీగా వున్నా, ఆ సినిమాలను కాదని అడ్డాల శ్రీకాంత్ మీద నమ్మకంతో “బ్రహ్మోత్సవం” చేసాడు. “ముకుంద” సినిమా చూసి కూడా అడ్డాల శ్రీకాంత్‌కు అవకాశం ఎలా ఇచ్చాడోనని చాలామంది ఆశ్చర్యపొయారు. పి.వి.పి ఖర్చుకు వెనుకాడకుండా చాలా రిచ్‌గా ప్రెజెంట్ చేసే అవకాశం దర్శకుడికి ఇచ్చాడు. మంచి సినిమాలు తీయ్యాలంటే దర్శకుడిని కావల్సింది మనిషి మంచితనం కాదు, ప్రేక్షకులకు నాడి తెలుసుకొని వాళ్ళకు నచ్చే విధంగా ఇవ్వడం అని అడ్డాల శ్రీకాంత్ “ముకుంద” సినిమా ద్వారా తెలుసుకొలేక పొవడం బాదకారం. సోషల్ నెట్‌వర్కింగ్ ట్రెండ్ చూస్తుంటే, మహేష్ అభిమానులకు కూడా సినిమాల మీద విరక్తి వచ్చినట్టు కనబడుతుంది. సినిమా కాన్సప్ట్, ఎంచుకున్న పాయింట్ బాగుంది కాని, దానిని ప్రెజెంట్ చేసిన విధానం బాగోలేదని, టివి సిరియల్లా సాగిందని మహేష్‌ఫ్యాన్స్ టాక్. ఈ విమర్శలు అడ్డాలపై ఇప్పుడొస్తున్నవి కావు, ఎప్పటినుండో వున్నవే. అవి సరిదిద్దుకొని “బ్రహ్మోత్సవం” తీస్తాడని అందరూ అనుకున్నారు, కాని అలానే అదే ఫార్మ్‌ట్‌తో తీయడంతో ఇలా జరిగిందని మహేష్‌ఫ్యాన్స్ దగ్గరనుండి వినిపిస్తుంది.

మహేష్‌బాబు & పవన్‌కల్యాణ్ టాలీవుడ్‌కు రెండు కళ్ళు అని అంటూ వుంటారు. వాళ్ళ అభిమానులకు అభిమాన దర్శకుడెవరు అంటే “త్రివిక్రమ్ శ్రీనివాస్”. మహేష్‌బాబు మీద గౌరవంతో “అ.. ఆ సినిమాను మే నెలలో రిలీజ్ చెయ్యకుండా ఆపేసాడు.

సినిమాల విరక్తితో వున్న ఈ సమయంలో “అ.. ఆ” రిలీజ్ చేస్తే, “అ.. ఆ” ఎంత మంచి సినిమా అయినా విరక్తి ప్రభావం కచ్చితంగా వుంటుంది.

త్రివిక్రమ్ సినిమా తీయడమే తన బాద్యత అనుకుంటాడు, పబ్లిసిటీ కూడా ఇంపార్టెంట్ అని తెలిసినా ప్రత్యేకంగా ఏమీ కేర్ తీసుకున్నట్టుగా అనిపించడు. భారీ కలక్షన్స్‌తో పాటు నితిన్‌ను పెద్ద హిరోగా చేస్తున్న త్రివిక్రమ్ ప్రయత్నం ఫలించాలంటే “సినిమా రిలిజ్ డేట్” చాలా ఇంపార్టెంట్. రైట్ పబ్లిసిటీ కూడా ఎంతో అవసరం. లేకపొతే ఈ సినిమా ఒక సాదాసీదా సినిమాగా నిలిచిపొయే ప్రమాదం వుంది.

Very Well Edited Song by online Creators:
httpv://youtu.be/mESgGD_-z9Y

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in అ ఆ, Featured. Bookmark the permalink.