త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తూ త్రివిక్రమ్ కలం నుంచి జాలువారిన మంచి ఫీల్ గుడ్ రొమాంటిక్ డ్రామా ‘అ..ఆ..’ జూన 2న విడుదల కానుంది. అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారి అనేది ఉపశీర్షిక. ఆడియోకు మంచి స్పందన వస్తోంది. మిక్కీ సంగీతం అందరినీ మెప్పిస్తోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స సంస్థ నిర్మించింది. నితిన్, సమంత జంటగా నటిస్తున్న సినిమాలో అనుపమ పరమేశ్వరన్ మరో నాయిక. నదియ, అనన్య, ఈశ్వరీరావు, సన, గిరిబాబు, పోసాని, నరేశ్, రావు రమేశ్, అవసరాల శ్రీనివాస్, ప్రవీణ్, రఘుబాబు, పమ్మి సాయి, శ్రీనివాస్ రెడ్డి ఇతర పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు సంగీతం: మిక్కీ.జె.మేయర్, కెమెరా: నటరాజ్ సుబ్రమణియన్, ఆర్ట్: ఎ.ఎస్.ప్రకాశ్, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, సౌండ్ డిజైన్: విష్ణు గోవింద్, శ్రీ శంకర్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: పి.డి.వి.ప్రసాద్, సమర్పణ: మమత.
బాహుబలి సినిమా తెలుగుసినిమా కమర్షియల్ రేంజ్ పెంచినా, కమర్షియల్‌గా కనీసం దానిలో సగం కూడా రీచ్ కాలేకపొతున్నారు మన పెద్ద హిరోలు. హైప్ వస్తుంది కాని, మొదటిరోజే తుస్సు మంటుంది. అభిమానులను కూడా అలరించలేకపొతున్నారు. ప్రస్తుతం ట్రెండ్‌లో సినిమాకు భారీ డబ్బులు రావాలంటే హైప్ కావాలి. పెద్దగా హైప్ లేని, ఈ సినిమా ఎటువంటి టాక్ సంపాదించుకుంటుందో మరియు ఎంత కలక్షన్స్ సాధిస్తుందో !!!
Cinema ki kavalsindi hip kadi content