పవన్‌కల్యాణ్ ఇంకా ఎన్ని సినిమాలు చేస్తాడో ఎవరికీ తెలియదు. ఇంకో సినిమాకు సంబంధించిన వర్క్ ఎప్పుడో స్టార్ట్ అయ్యింది. షూటింగ్ జూన్ 2 నుంచి పొల్లాచిలో స్టార్ట్ అవుతుందటున్నారు. ఖుషీ & కొమరం పులి ఫేం ఎస్.జె.సూర్య దర్శకుడు. శ్రుతి హాసన్ కథానాయిక. శరత్‌మరార్ నిర్మాత. ఫ్యాక్షన్ నేపథ్యంలో సాగే ప్రేమకథను ఆకుల శివ అందిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం.
ఈసారి పెద్ద గ్యాప్ ఇవ్వకుండా సినిమాను స్టార్ట్ చేస్తున్నందకు పవన్‌ఫ్యాన్స్ తమ సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఇంకా పేరు పెట్టని ఈ సినిమా 2017 సంక్రాంతికి వచ్చే అవకాశం వుంది. బాలకృష్ణ 100వ చిత్రం “గౌతమ పుత్ర శాతకర్ణి” కూడా అదే సమయంకి రిలీజ్ టార్గెట్ పెట్టుకొని పని చేస్తున్నారు.