త్రివిక్రమ్ ఒక్కడే మిగిలాడు

pawan-mahesh

దూకుడు .. శ్రీమంతుడు

గబ్బర్‌సింగ్ .. అత్తారింటికి దారేది

ఈ సినిమాలతో మంచి పేరు సంపాదించుకొవడమే కాదు, ఫ్యాన్స్‌లో సరికొత్త ఉత్సాహాన్ని నింపారు.

ఇప్పుడు సర్దార్ గబ్బర్‌సింగ్ .. బ్రహ్మోత్సవం. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఫ్యాన్స్‌కు ఆక్రందనలు .. రెండు రూపాయాలు సంపాదించుకుందాం అనుకున్న ఎక్సిబిటర్స్‌కు హార్ట్ ఎటాక్‌లు .. మిగిల్చాయి.

తప్పెవరిది?
పవన్‌కల్యాణ్ తొందరగా రియలైజ్ అయ్యి, 70% మూడు నెలల్లో చుట్టేసి జనాల మీదకు వదిలేసాడు. డబ్బులు పొగొట్టుకున్న ఎక్సిబిటర్స్‌కు సహాయం చేస్తున్నాడు. మహేష్‌బాబు మాత్రం ఇంత ఘోరమైన ఫ్లాప్ అసలు ఎక్సపెట్ చెయ్యలేదు. డైరక్టర్‌ను నమ్మాడు (ఎప్పుడూ అంతే). ముకుంద సినిమా ఫ్లాప్ అయిన తర్వాత తన తప్పులు తెలుసుకోకుండా, ఇంత పెద్ద సినిమా బాద్యత తీసుకొవడం కచ్చితంగా అడ్డాల శ్రీకాంత్ తప్పే.

మహేష్‌బాబు & పవన్‌కల్యాణ్ తమ తమ రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చేసినా, పూడని నష్టాలు కలిగించాయి ఈ సినిమాలు. రెండు సినిమాలకు బాగా ఖర్చు పెట్టారు.

ఇద్దరిని ఆదుకొవడానికి త్రివిక్రమ్ ఒక్కడే మిగిలాడు:
ఫ్యాన్స్‌లో మళ్ళీ ఉత్సాహం .. ఎక్సిబిటర్స్‌కు నాలుగు రూపాయల లాభం .. రావాలంటే, వీళ్ళిద్దరికీ త్రివిక్రమ్ ఒక్కడే మిగిలాడు. నాలుగు నెలల్లో ఒక మంచిసినిమా వాళ్ళకు అందించగలడు. ఇద్దరికి వేర్వేరు సినిమాలు కాకుండా, ఇద్దరితో ఒక మల్టీ స్టారర్ సినిమా తీస్తే సూపర్ వుంటుంది.

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in Pawan Kalyan. Bookmark the permalink.