SKN @SKNonline
.@AlluSirish shares joy of his Brother @alluarjun’s #Yodhavu super success in #Kerala tomorrow at @Redfm
కేవలం టాలెంట్ వుంటే సరిపోదు & కష్టపడితే సరిపోదు. దానికి తగ్గ ప్లానింగ్ కూడా వుండాలి. ప్రేక్షకులకు దగ్గరవ్వడానికి “మేము మీకు చెందిన వాళ్ళమే, మీరు ఎంతగా ప్రేమిస్తారో మేము కూడా అంతే కృతజ్ఞతతో వుంటాం” అని చెప్పగల్గాలి. మళయాళ సరైనోడు ప్రమోషన్లో అన్నయ్యకు తమ్ముడు హెల్ప్ చేస్తున్నాడు. ఈ ప్లానింగ్‌కు తోడు సక్సస్ కూడా కంటీన్యూ అయితే, సౌత్ ఇండియా స్టార్ బ్రదర్స్ సూర్య & కార్తీలను డామినేట్ చేసేస్తారు.
అల్లు అర్జున్, బోయపాటి శీను కాంబినేషన్ లో వచ్చిన ’సరైనోడు’ సినిమాని తెలుగు వెర్షన్ విడుదల అయిన వారం తరువాత మళయాలం వెర్షన్ విడుదల చేయాలనుకున్నా కొన్ని కారణాల వలన అది జరగలేదు. దాదాపు 80 థియేటర్స్ లో అల్లు అర్జున్ ‘యోధావు’ (‘సరైనోడు’ మళయాలం వెర్షన్ )కేరళలో నిన్న విడుదలైనది. కేరళలో ఉన్న అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంచనాలకు తగ్గట్టుగా ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ వచ్చాయంటున్నారు. ఈ సినిమాకి కొన్ని చోట్ల ప్రీమియర్ షోలు కూడా వేసారంట. అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ నిన్న కేరళలోని తిరువనంతపురం లో అల్లు అర్జున్ అభిమానుల తో కలిసి చూసాడంట.