బాహుబలిని కొట్టేదెవరు

IMG_242706

ఇప్పుడు ఏ సినిమా రికార్డ్స్ చూసినా, నాన్-బాహుబలి రికార్డ్స్ అంటున్నారు. అంటే అందరూ చేతులెత్తేసినట్టేనా?

బాహుబలి రికార్డ్స్ కొట్టాలంటే 1) వైవిధ్యమైన కథాంశం కావాలి & 2) క్లాస్ & మాస్ మెచ్చే దర్శకుడై వుండాలి.

“సర్దార్ గబ్బర్‌సింగ్” ఫస్ట్ డే ఊపు చూసినప్పుడు, పవన్‌కల్యాణ్‌కు సాధ్యమేనోమో అనిపించింది కాని, అంత సత్తా కలిగిన సబ్జక్ట్ పవన్‌కల్యాణ్ ఎంచుకోడు. సినిమా అంతా హిరో మీదే నడవాలి, అన్నీ హిరోనే చెయ్యాలనుకుంటాడు. దానికి తోడు ఇప్పుడు దృష్టంతా పొలిటిక్స్ మీదే వుంది. త్రివిక్రమ్‌తో చేయబోయే సినిమా కథాంశం బట్టి ఛాన్స్ వుంది. టార్గెట్ పెట్టుకొని చేసే అలవాటు, ఇటు పవన్‌కల్యాణ్‌కు లేదు అటు త్రివిక్రమ్‌కు లేదు.

మహేష్‌బాబు కొత్త కథంశాలు చెయ్యడానికి వెనుకాడడు, కాని ఆ కథంశాలు క్లాస్‌కు మాత్రమే పరిమితం అవుతున్నాయి. ప్రస్తుతం చేస్తున్న మురుగదాస్ సినిమాకు ఛాన్స్ వుంది. రెండు బాషలు టార్గెట్ చేస్తున్నారు కాని, బాహుబలిని టార్గెట్ చేస్తున్నట్టు వినిపించడం లేదు.

పెద్ద దర్శకులకు అల్లు అర్జున్ అంటే చిన్నచూపు. మంచి దర్శకులందరూ చిరంజీవి వారసుడిగా రామ్‌చరణ్‌ను రీచ్ కాలేకపొతే, ఆ తర్వాత అల్లు అర్జున్‌ దగ్గరకు వస్తున్నారు. అల్లు అరవిందే ఏదొకటి చెయ్యాలి. అల్లు అర్జున్‌లో వున్న ఒక మంచి లక్షణం ఏమిటంటే, మంచి దర్శకుడు, తనతో ట్యూన్ అవుతాడనుకుంటే, తనతో సినిమా చెయ్యమని అడగడానికి వెనుకాడడు.

మగధీర ఇమేజ్‌తో రామ్‌చరణ్ ప్రయత్నం చేయవచ్చు, కాని ఆ ప్రయత్నం చేసే దర్శకులు లేరు. సుకుమార్ చేసే సినిమా కూడా నాన్-బాహుబలి టార్గెట్టే.

ఎన్.టి.ఆర్ ఆ ప్రయత్నమే చేసున్నట్టు కనిపించడం లేదు. ప్రస్తుతం క్లాస్ ప్రేక్షకులకు దగ్గరయ్యే పనిలో వున్నాడు.

చిరంజీవి 150 సినిమా మాక్సిమమ్ రేంజ్ 100 కోట్లు.

బాలకృష్ణ 100 వ సినిమా రికార్డ్స్ కంటే రివార్డ్స్ కు ప్రాదాన్యత ఇచ్చినట్టు వున్నారు.

bottomline:
ఇంకో పదేళ్ళు బాహుబలి రికార్డ్స్ పదిలం.

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in బాహుబలి. Bookmark the permalink.