"అఆ" – చాలా బాగుంది

a aa

దాదాపు ఏడాదిగా దర్శకుడు త్రివిక్రమ్ అభిమానులు ఎదురుచూస్తున్న సినిమా అ..ఆ. ఒకే ఒక షెడ్యూల్‌లో ఫినిష్ చేద్దామని మొదలుపెట్టిన సినిమా అనుకోని విధంగా చాలా లేటు అయ్యి, రేపు రిలీజ్ కాబోతుంది.

ఒక పెద్ద హిరో సినిమానో ఒక నొటేడ్ సినిమానో రిలీజ్ అయితే, సినిమా చూసిన వాళ్లను అడిగే మొదటి ప్రశ్న “సినిమా ఎలా వుంది? ఈ వీకెండ్ థియేటర్లో చూడొచ్చా?”. ఈ వారం “అఆ – చాలా బాగుంది తప్పకుండా చూడండి” అనే జవాబు కోసం అందరూ చూస్తున్నారు. కారణం అందరూ కలిసి చూడతగ్గ ఒక మంచి సినిమా కోసం అందరూ ఎదురుచూస్తున్నారు.

ప్రేక్షకుల అంచనాలను త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎంతవరకు రీచ్ అవుతాడో తెలియాలంటే & అనూహ్యంగా పెరిగినట్టు అనిపిస్తున్న తెలుగుసినిమా మార్కెట్‌లో ఈ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుందో ఒక అంచనాకు రావాలంటే ఇంకో రోజు వెయిట్ చెయ్యాలి.

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in అ ఆ. Bookmark the permalink.