వెబ్ ప్రపంచంలో ఎన్నో సినిమా రివ్యూలు .. ఇది కూడా ఒకటి. ఎవరి కోసం అంటే చెప్పడం కష్టం. అదో దురద(గుల) అంతే.
కథ ఏమిటి?
మూల కథ & క్యారెక్టర్స్ యుద్దనపూడి సులోచనా రాణి నవల “మినా” నుంచి తీసుకున్నవి. త్రివిక్రమ్ చాలా బాగా ఇంప్రూవైజ్ చేసాడు. కథ చెప్పిన విధానం స్లోగా వున్నా, అక్కడక్కడా కొద్దిగా బోర్ అనిపించినా, సినిమా బాగుందనే ఫీలింగ్ తోనే బయటకు వస్తారు.
త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రత్యేకత ఏమిటి?
ఫస్ట్ ఫ్రేమ్ నుంచి నుంచి చివరి ఫ్రేమ్ వరకు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా. అదే ప్రత్యేకత.
నితిన్ రోల్ ఏమిటి?
కథంతా సమంతా మీద నడుస్తుంది కాబట్టి, నితిన్ రోల్ తక్కువెమో అనిపిస్తుంది కాని, నితిన్ బాగున్నాడు.. బాగా చేసాడు. ఈ సినిమా చెయ్యడం కచ్చితంగా అదృష్టమే.
సమంతా డామినేట్ చేసిందా?
డామినేట్ ఏమి చెయ్యలేదు కాని, కథంతా సమంతా మీద నడుస్తుంది. బాగా చేసింది.
ఇంకా ఎవరు బాగా చేసారు?
అందరూ బాగా చేసారు. సినిమాకు బాగా కనెక్ట్ అయిన వాళ్ళకు, లాస్ట్‌లో రావు రమేష్ డైలాగ్స్ కు కళ్ళవెంట నీళ్ళు వచ్చేంత నవ్వు వస్తుంది.
అమెరికాలో 2 మిలియన్స్ కలెక్ట్ చేస్తుందా?
జనాల ఊపు చూస్తుంటే 2 మిలియన్స్ చాలా ఈజీగా చెయ్యాలి. 3 మిలియన్స్ రీచ్ అయితే సూపర్. కలక్షన్స్ సంగతి పక్కన పెడితే: అత్తారింటికి దారేది, భలే భలే మగాడివోయ్, శ్రీమంతుడు, నాన్నకు ప్రేమతో & వూపిరి సినిమాల కంటే ఎక్కువ మంది థియేటర్‌కు వెళ్ళి చూస్తున్నారు/చూస్తారు. ఒక వ్యూహం ప్రకారం అన్నీ సెట్ చేసుకోగల్గితే, త్రివిక్రమ్ నెక్స్ట్ సినిమాతో బాహుబలిని కొట్టేయగలడు.
bottomline:
అందరినీ ఆకట్టుకునే “అ ఆ”. రెండోసారి చూడదగిన సినిమా. ఇంకా బాగా ఎంజాయ్ చేయవచ్చు.