'బాబు బంగారం' టీజర్‌ వస్తుంది

babubangaram

‘బాబు బంగారం’ సినిమాలో హిరో వెంకటేష్. దర్శకుడు మారుతి. ఇప్పటికే ఫస్ట్‌లుక్‌తో మంచి ఆసక్తి రేకెత్తించింది. రేపు(జూన్ 6) ఫస్ట్ టీజర్‌ను విడుదల చేయనున్నారు.

నాగార్జున సినిమా జీవితం అయిపొయిందనుకున్న సమయంలో, నాగార్జున “మనం” “సొగ్గాడే చిన్ని నాయన” & “ఊపిరి” లాంటి సినిమాలు ఇచ్చి సరికొత్త ఇమేజ్‌తో మరింత ఉత్సాహంతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. వెంకటేష్ మల్టీస్టారర్ ట్రెండ్ క్రియేట్ చేసాడు కాని, అందుకు తగ్గట్టు కమర్షియల్ రేంజ్ లేకపొయేసరికి తెలుగు హిరోలెవరూ అంత ఇంటరెస్ట్ చూపించడం లేదు.

దర్శకుడు మారుతి. దర్శకుడు అనే కంటే మారుతి ఒక బ్రాండ్ అంటే కరెక్ట్. మాస్ పల్స్ తెలిసినోడు. మొదట్లో బూతును మార్గంగా ఎంచుకున్నా, ‘భలే భలే మగాడివోయ్’ సినిమాతో ఆ బూతు మార్క్‌ను చేరేపేసుకున్నాడనచ్చు. ఇప్పుడు వెంకటేష్‌కు సరికొత్త ఇమేజ్ క్రియేట్ చేసే ప్రయత్నంలో వున్నాడు. టీజర్‌తో ఈ సినిమాపై మరింత ఆసక్తి పెరిగే అవకాశాలు వున్నాయి.

కమర్షియల్ లెక్కల ప్రకారం రెండో స్థానంలో లేకపొయినప్పటికీ , అమెరికాలో బాహుబలి తర్వాత ఎక్కువమంది థియేటర్‌లో చూసిన సినిమా “భలే భలే మగాడివోయ్” అని కొందరు వాదిస్తూ వుంటారు. మంచి టాక్‌కు తోడు టిక్కెట్టు రేటు తక్కువ కావడంతో ఎక్కువమంది చూసారు. “భలే భలే మగాడివోయ్” రికార్ద్‌ను, ఇప్పుడు “అ ఆ” కొట్టేస్తుంది. బాబు బంగారం టిక్కెట్టు రేటు ఎంత పెడతారో????

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in Extended Family. Bookmark the permalink.