చిరంజీవి సరసన దీపిక

chiru150

చిరంజీవి నటించే 150వ చిత్రం తమిళంలో సూపర్ హిట్టయిన ‘కత్తి’ చిత్రం రీమేక్. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ దర్శకత్వం వహిస్తున్న సంగతి విదితమే. ఈ నెల 15 నుంచి ఈ చిత్రం షూటింగును హైదరాబాదులో నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. భారీ ఫైట్ సీక్వెన్సును చాలా రిచ్ గా ప్లాన్ చేస్తున్నారట. రత్నవేలు ఛాయాగ్రాహకుడిగా పనిచేస్తున్నాడు. ఇందులో నటించే కథానాయిక ఎవరన్నది అధికారికంగా ఇంకా ప్రకటించనప్పటికీ, తాజాగా బాలీవుడ్ భామ దీపికా పదుకొనేను పరిశీలిస్తున్నట్టు సమాచారం. వినాయక్ స్పెషల్ కేర్ తీసుకొని చేస్తున్న ఈ సినిమా ఎంత షేర్ సాధిస్తుందో ఎవరూ అంచనా వేయలేరు కాని, చిరంజీవి 150వ చిత్రం , 150 కోట్లు షేర్ సాధించాలని మెగా అభిమానుల కోరిక.

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in ఖైదీ నెం 150. Bookmark the permalink.