మారుతి దర్శకత్వంలో వినోదాత్మకమైన పోలీసు అధికారిగా వెంకటేష్ నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘బాబు బంగారం’. నయనతార హిరోయిన్. వెంకటేష్ స్టైల్లో సరదాగా సాగే ఈ కమర్షియల్ ఎంటర్టైనర్ . టీజర్ అదిరింది. ఈ సినిమాతో దర్శకుడు “మారుతి” పెద్ద దర్శకుల జాబితాలో జాయిన్ అయిపొయేట్టు వున్నాడు.
టీజర్ బాగుంది కాని:
సినిమా ఓవర్ బడ్జెట్ అవుతుందని నిర్మాత, సినిమా అవుట్పుట్ అనుకున్న విధంగా రావడం లేదని హిరో వెంకటేష్ అసంతృప్తిగా వున్నారనే టాక్ ఫిలింనగర్లో వినిపిస్తుంది. అంతే కాదు, “భలే భలే మగాడివోయ్” హిట్ అయ్యింది కదా అని మరీ ఓవర్ ఎక్సపెటేషన్స్ పెట్టుకున్నవాళ్ళకు నిరాశే అని కూడా అంటున్నారు.
మారుతికి మాస్ పల్స్ తెలుసు:
మారుతి ఎంచుకున్న పాయింట్ లన్నీ చాలా బాగుంటాయి కాని, కథనంలో కొద్దిగా తేడా కొడతాయి. భలే భలే మగాడివోయ్ తో కథనంలో కూడా మంచి పట్టు సంపాదించాడు. సినిమా ఎవరేజ్ వుంటే చాలు. ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతున్నారు. ఎవరేజ్ సినిమా అయితే కచ్చితంగా తీసి వుంటాడు. అన్ని కలిసొస్తే, మరో హిట్ తన ఖాతాలో వేసుకొవడమే కాదు, పెద్ద దర్శకుల జాబితాలో జాయిన్ అయిపొతాడు.
httpv://youtu.be/MsZcOA30Bb0