ఓ మనసా చేరువగా రా ఇలా రా ఇలా…
నను నీతో లాగుతూ దొరకననే పరుగవుతావేలా
ఓ మనసా చేరువగా రా ఇలా… రా ఇలా…
ఔనంటూ కోరుతోంది వద్దంటూ ఆపుతోంది
ఏదైనా నా పైన ఉన్న ఇష్టమే కదా..
నువ్వంతా దూరముంటే నా శ్వాస గింజుకుంది
ఆవేదనేంటో నువ్వు పోల్చలేనిదా
ఓ మనసా చేరువగా రా ఇలా
నను నీతో లాగుతూ దొరకననే పరుగవుతావేలా
ఓ మనసా చేరువగా రా ఇలా
ఔనంటూ వద్దంటూ ఆపుతోంది
ఏదైనా నా పైన ఉన్న ఇష్టమే కదా..
కాదన్నా నీ మాటే కత్తిలా తాకే నా కలలతో ఆడకే
వరించీ వైరం నాపై ఎందుకే.. ఉరి తీయకే ఊరికే
ఒక్క నిమిషం నేను నువ్వై చూడవే…
కరుణించే కాంతిగా నా ప్రేమను అవుననవా నువ్వే
పున్నమివై వెన్నెలగా మారవే…
ఏనాటిదీ బంధం ఎన్నటి మూలం ఏనాటికీ తేలదే..
ఉన్నహాయి ప్రయాణం సాగించే వివరం నువ్వాపినా ఆగదే
నిజమొకటే ఎన్నటికీ మారదే…
విధి వేరే రాస్తున్నదా మనకిపుడీ పరిచయమే కాదే
తలపునకు వలపు ఋణం తీరదే
ఔనంటూ కోరుతుంది వద్దంటూ ఆపుతోంది
ఏదైనా నా పైన ఉన్న ఇష్టమే కదా
నువ్వంతా దూరముంటే నా శ్వాస గింజుకుంది
ఆవేదనేంటో నువ్వు పోల్చలేనిదా
ఓ మనసా చేరువగా రా ఇలా… రా ఇలా…
ఇంకెందుకులే దాపరికమ్మా నచ్చిన పిల్లవు నువ్వేనమ్మా
httpv://youtu.be/LuAfLMwYTJA