రణధీర్, రుక్‌సర్ మిర్ జంటగా, యం.యం.కీరవాణి తమ్ముడు & యస్.యస్. రాజమౌళి అన్నయ్య ఎస్.ఎస్.కాంచీ దర్శకత్వంలో రుపొందుతున్న మొదటిచిత్రం ‘షో టైమ్’.
ఈ సినిమా టీజర్ విడుదల కార్యక్రమం ఆదివారం హైదరాబాద్ ప్రసాద్‌ల్యాబ్స్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో రమా రీల్స్ లోగోను ఎం.ఎం.కీరవాణి ఆవిష్కరించారు. వెబ్ పేజీని కె.రాఘవేంద్రరావు విడుదల చేయగా షో టైమ్ పోస్టర్‌ను కల్యాణి కోడూరి విడుదల చేశారు. టీజర్‌ను ఎస్.ఎస్.రాజమౌళి విడుదల చేశారు.
కొన్ని సినిమాలకు వచ్చేవాళ్ళంతా సినిమా చూడటానికి మాత్రమే రారు, కొందరు తినటానికి, కొందరు పొడుకొవడానికి, కొందరు పైరసీ చెయ్యడానికి, కొన్ని జంటలు రొమాన్స్ కోసం కూడా వస్తుంటారు అని చెప్పడంతో పాటు, చివరికి సినిమా హాల్లో హిరోయిన్ మాత్రమే మిగిలి, బొయ్ ఫ్రెండ్ కోసం అరుస్తుంది.
సినిమా హాలు బ్యాక్‌డ్రాప్ లో జరిగే ఒక సస్పెన్స్ థ్రిల్లర్ అని టీజర్ ద్వారా బాగా చెప్పారు.
హీరో రణధీర్, హీరోయిన్ రుక్‌సర్ మీర్ తో పాటు కార్తీక్, సంజిత్, ఆదిత్య, సత్య, అమిత్ శర్మ, రవిప్రకాష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే: ఎస్.ఎస్.కాంచీ, మ్యూజిక్: ఎం.ఎం.కీరవాణి, సినిమాటోగ్రఫీ: భూపతి.కె, స్టైలింగ్, సెట్ డేకరేషన్: సీతా కాంచీ,ఎడిటింగ్: ఎన్.హెచ్.హరి, వి.ఎఫ్.ఎక్స్: వెంకట్ సునీల్‌రావ్ ఆకుల, ఫైట్స్: రామ్, లైన్ ప్రొడ్యూసర్: నయీమ్ షేక్, కో ప్రొడ్యూసర్: కిరణ్ తనమల, ప్రొడ్యూసర్: జాన్ సుధీర్ పూదోట, దర్శకత్వం: కాంచీ 5497.
httpv://youtu.be/ii4jGjyOB6c