ఆగ‌ష్టు 13న సుప్రీమ్ సాయి ధ‌రమ్ తేజ్ ‘తిక్క’

thikka

హ్యాట్రిక్ స‌క్స‌ెస్ ని అందుకున్న సుప్రీమ్ హీరో సాయిధ‌రమ్‌ తేజ్, ల‌రిస్సా బోన్సి, మ‌న్నార చోప్రా జంట‌గా, సునీల్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో, డాక్ట‌ర్. సి.రోహిన్ రెడ్డి నిర్మాత‌గా శ్రీ వెంకటేశ్వ‌ర మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ లో రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ గా రూపోందిస్తున్న చిత్రం ‘తిక్క’ చిత్రం ల‌డ‌క్ లో చివ‌రి పాట చిత్రీక‌ర‌ణ‌తో షూటింగ్ కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుంది. ఇప్ప‌టికే పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. జులై 20న మెద‌టి లుక్ టీజ‌ర్‌ని విడుద‌ల చేసి,ఎస్‌.థ‌మ‌న్ సంగీత సారథ్యంలో అందించిన సూప‌ర్బ్‌ ఆడియో ని జులై 30న‌ గ్రాండ్ గా విడుద‌ల చేయ‌నున్నారు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి ప్ర‌పంచ‌వ్యాప్తంగా చిత్రాన్ని అగ‌ష్టు13న‌ విడుద‌ల చేయ‌టానికి నిర్మాత డాక్ట‌ర్.సి.రోహిణ్ రెడ్డి స‌న్నాహాలు చేస్తున్నారు.

  1. పిల్లా నువ్వు లేని జీవితం హిట్ అనిపించుకొవడానికి కారణం రవికుమార్ చౌదిరి స్క్రిప్ట్ & స్క్రీన్‌ప్లే. ఈ సినిమాకు ఎన్నో సినిమా కష్టాలు ఎదురైనా హిట్ అవ్వడంతో సాయి ధర్మ్ తేజ్‌కు మంచి పేరు వచ్చింది.
  2. సుబ్రమణ్యం ఫర్ సేల్ ఎవరేజ్ అనిపించుకొవడానికి కారణం హరీష్‌శంకర్. హై ఎక్సపెటేషన్స్ వలన అంచనాలు రీచ్ అవ్వలేదు, ఫ్లాప్ అవ్వక పొవడంతో ఎవరేజ్ అయ్యింది. మెగాబ్రదర్స్ ను బాగా ఇమిటేట్ చేస్తున్నాడని, సాయి ధర్మ్ తేజ్‌పై కొద్దిగా నెగిటివ్ అభిప్రాయం కలుగజేసింది.
  3. సుప్రీమ్ హిట్ అనిపించుకొవడానికి కారణం అనిల్ రావిపూడి. మాస్‌లో సాయి ధర్మ్ తేజ్‌కు మంచి పేరు తెచ్చి పెట్టింది. మినిమమ్ గ్యారంటీ హిరోను చేసింది.

సాయిధర్మతేజ్ తిక్క సినిమాకు సునీల్ రెడ్డి తెలివైన టెక్నికల్‌గా మంచి దర్శకుడు అయినా, మాస్ పల్స్ తెలిసిన దర్శకుడు కాదనుకుంట. మూడు హిట్ సినిమాలు వచ్చి, సాయి ధర్మ్ తేజ్ మంచి పేరు తెచ్చుకోబట్టి, ఈ సినిమాపై మంచి ఆసక్తి నెలకొనివుంది. కేవలం సునీల్ రెడ్డితో ఫ్రెండ్‌షిప్ వలన సాయి ధర్మ్ తేజ్ ఈ సినిమా చేస్తున్నాడనుకుంట. దర్శకుడు పరంగా చూస్తే హిట్ అనిపించుకొవడం కష్టమైన పని. నాని “జెంటిల్‌మేన్” సినిమాలా సరప్రైజ్‌గా హిట్ అనిపించుకుంటుందెమో చూడాలి. ఈ సినిమా హిట్ అయితే, సాయి ధర్మ్ తేజ్‌కు ఇంకా మంచి పేరు వస్తుంది.

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in తిక్క. Bookmark the permalink.