జనతా గ్యారేజ్ షూటింగ్ మొదలైన సమయంలోనే ఈ సినిమాను ఆగస్టు 12న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్. కాని ఇప్పుడు ఆగస్టు 12న కాకుండా సెప్టెంబర్ 2న అని నిర్ణయించారు. కష్టపడి పని చేసారు కాని, కొద్దిగా మిగిలివుంది. అది కూడా ఫినిష్ చేసేయచ్చు. అలా చెయ్యడం ఇష్టం లేక మూడు వారాలు వాయిదా వేసారు.
తొందరగా చూసేద్దాం అనుకునే ఫ్యాన్స్ ను కచ్చితంగా బాదపెట్టే న్యూస్. కాకపొతే శుభవార్త. హడావుడి లేకుండా, కాంప్రమైజ్ అవ్వకుండా పొస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేసుకొవచ్చు. సినిమాలో కంటెంట్ వుండి వుంటే మంచి నిర్ణయం.
కొరటాల శివ, ప్రభాస్ & మహేష్బాబులకు, ఆ టైంకు వాళ్ళ కెరీర్ బిగ్గెస్ట్ హిట్స్ ఇచ్చాడు. ఇప్పుడు ఎన్.టి.ఆర్ కు ఇవ్వగలడా అని అందరూ ఎదురుచూస్తున్నారు.
httpv://youtu.be/qLXU1VU3HLU